Good News : గ్యాస్ వాడే వారికి చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..!
Good News : ఆంధ్ర ప్రదేశ్ లో ఎల్.పి.జి గ్యాస్ సిలిండర్ వినియోగదారుఇలకు దీపం పథకం కింద ఉన్న వారికి కొత్త అవకాశాన్ని అందిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇప్పటికే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే దీనికి సంబందించిన కీలక ప్రకటన రాబోతుందని తెలుస్తుంది. ఐతే దీనిలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన తో అనుసంధానం చేసి రాష్ట్ర ప్రజలకు మరింత సౌకర్యాలను అందించాలని చూస్తున్నారు.
చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ద్రీపం పథకాన్ని కేంద్రం లోని ప్రధాన మంత్రి ఉజ్వల యోజన తో అనుసంధానం చేయాలని చూస్తున్నారు. దీపం పథకం కింద గ్యా కనెక్షన్స్ పొందిన వారికి ఉజ్వల యోజన ప్రయోజనాలు అందించేలా ఇంటిగ్రేషన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 300 రూపాయల సబ్సిడీ ప్రతిపాదన ఉంది. పీఎం ఉజ్వల యోజన కింద ఒక్కో సిలిండర్ 300 రూపాయలు అమోదించేలా రాష్ట్రంలో ఎల్.పి.జి వినియోగ దారులకు అదనపు ఆర్ధిక భారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా పేద వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Good News కేంద్ర ప్రభుత్వ చర్చలు..
అయితే ఈ ప్రతిపాదనకు సంబంధించి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీలో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ ను కలిసి మాట్లాడటం జరిగింది. ఈ పథకాల మార్పులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కోరుతుంది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10.05 లక్షల గ్యాస్ చొన్నెచ్తిఒన్స్ ఉన్నాయి. ఐతే ఇందులో దీపం పథకం కింద సుమారు 2 లక్షల కనెక్షన్లు, ఇంకా ఉజ్వల కింద 3,063, సి.ఎస్.ఆర్ కింద 4,354 కనెక్షన్లు ఉన్నాయి.
ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించినట్లయితే దీపం పథకం కింద గ్యాస్ వినియోగదారులు 300 రూపాయలు తిరిగి సబ్సిడీగా అందిస్తారు. ప్రస్తుతం సిలిండర్ ధర 860 రూపాయలు ఉండగా 300 సబ్సిడీ ఇస్తే 560 కే వినియోగదారులకు అందుతుంది. దీపం స్కీం ను 1997లో టిడిపి ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకంతో గ్రామీణ మహిళలకు, ముఖ్యంగా పొదుపు సంఘాల సభ్యులకు సబ్సిడీపై ఎల్ పి జి కనెక్షన్స్ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా ఎల్ పీ జీ గ్యాస్ వాడేలా ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేస్తుంది.