Ration Rice : కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!
ప్రధానాంశాలు:
Ration Rice : కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!
Ration Rice : తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్‌ను ఒకేసారి జూన్‌లోనే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించడంతో, ముందుగానే మూడు నెలల బియ్యం, గోధుమలు, చక్కెరను పంపిణీ చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.

Ration Rice : కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!
Ration Rice : తెలంగాణ రేషన్ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణి
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. జూన్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో మూడు నెలల రేషన్ సరఫరా ప్రారంభమవుతుంది. జూన్ 30 లోపు పంపిణీ పూర్తయ్యేలా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి లబ్దిదారుడికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆధారంగా నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు 18 కిలోల బియ్యం ఒకేసారి అందజేయనున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు.
ఇదేకాకుండా చక్కెర కిలో రూ.13.50కు, గోధుమలు కిలో రూ.7కు రాయితీ ధరలకే లభించనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 5 కేజీల చొప్పున, ఇతర కార్పొరేషన్‌లలో 2 కేజీల చొప్పున గోధుమలు పంపిణీ చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పంపిణీ సమయంలో అవగాహనతో రేషన్‌ను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా మూడు నెలల రేషన్ పంపిణీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుందని ప్రభుత్వం భావిస్తోంది.