Good News : మహిళా రైతులకి శుభవార్త.. వారికి ట్రాకర్లు, డ్రోన్స్…!
ప్రధానాంశాలు:
Good News : మహిళా రైతులకి శుభవార్త.. వారికి ట్రాకర్లు, డ్రోన్స్...!
Good News : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మహిళా రైతులకు ఎస్ ఎమ్ ఎ ఎమ్ పథకం ద్వారా 50 శాతం రాయితీ పై వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉంటాయని వ్యవసాయ అధికారి తెలియజేశారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంను రేవంత్ సర్కార్ మళ్లీ అమలు చేసేందుకు నిర్ణయించింది. అయితే, ఈసారి మహిళలకే వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Good News : మహిళా రైతులకి శుభవార్త.. వారికి ట్రాకర్లు, డ్రోన్స్…!
Good News అవకాశం చేజార్చుకోవద్దు..
ఎంపిక చేసిన రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోను మిగతా డబ్బులు డి.డి రూపంలో చెల్లించాలని తెలిపారు. ఈ పథకం మహిళా రైతులకు మాత్రమే వర్తిస్తుందని ఈ విషయాన్ని రైతులందరూ గమనించగలరని కోరారు.2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 24.90 కోట్ల సబ్సిడీని రైతులకు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే.. ఈనెల 31వ తేదీలోగా పథకాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఆసక్తి గల మహిళా రైతులు ధరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ ఆర్.సీ జిరాక్స్ (ట్రాక్టర్ సంబందిత పనిముట్లకు మాత్రమే), పాస్ పోర్టు సైజ్ ఫోటో తో ఈనెల 26 లోపు మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో అందజేయాలని కోరారు. పట్టాదారు పాసు బుక్ మహిళా రైతుల పేరు మీదనే ఉండాలని తెలిపారు.