Roja VS Bhuvaneswari : హల్లో భువనేశ్వరి నెక్స్ట్ జైలుకి అత్తాకోడళ్లే.. ఏయ్ రోజా నువ్వెంత.. నీ బతుకెంత
Roja VS Bhuvaneswari : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై ఆయన కుటుంబం మొత్తం రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ మాట్లాడని భువనేశ్వరి తన భర్త అరెస్ట్ తో బయటికి రావాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్ర స్థాయిలో ఆమె వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసన తెలిపితే కూడా అరెస్ట్ చేస్తున్నారని, మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని భువనేశ్వరి మండిపడ్డారు. అయితే.. భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఏపీ మంత్రి రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. పాలు పితుక్కొని, కూరగాయలు అమ్ముకుంటే ఇన్ని లక్షల కోట్లు వచ్చాయా భువనేశ్వరి గారు. 118 కోట్ల రూపాయల బ్లాక్ మనీ కొట్టేశారని ఐటీ నోటీసులు ఇచ్చింది. దీనికి భువనేశ్వరి గారు, లోకేష్ గారు ఏం సమాధానం చెబుతారు. దోచేయాల్సింది అంతా దోచేసి ఈ రోజు సిగ్గులేకుండా చంద్రబాబుకు మద్దతు చెప్పేందుకు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ ను తమకు అనుకూలంగా మార్చుకొని యువతకు పంగనామాలు పెట్టారు. యూత్ ఇకనైనా ఆలోచించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పార్టీకి పుల్ స్టాప్ పెట్టాలి. భువనేశ్వరి, బ్రాహ్మణి ఇద్దరూ దోచేసుకున్న డబ్బు గురించి తెలిసి ప్రజలే మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు ఎలాంటి వెన్నుపోటు దారుడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. భువనేశ్వరి, బ్రాహ్మణి.. చదువుకున్న వారు కాబట్టి తప్పు చంద్రబాబు చేసినా విధిలేక అడ్జస్ట్ అయి ఇంట్లో ఉన్నారని అనుకున్నాం కానీ.. ఈరోజు మీరు బయటికి వచ్చి మాట్లాడటం చూస్తుంటే మీరంతా కూడా గూడుపుఠాణీ చేసి చంద్రబాబు, లోకేష్ దోచుకొచ్చి తీసుకొచ్చిన దాన్ని లెక్కబెట్టి దాచింది భువనేశ్వరి, బ్రాహ్మణి కాబట్టి ఈరోజు ఆ తప్పుల్లో భాగస్వామ్యం ఉంది కాబట్టి తప్పించుకోవడానికి ఇలాంటి అబద్ధాలు చెబుతున్నారు.. అని రోజా వార్నింగ్ ఇచ్చారు.
Roja VS Bhuvaneswari : నేనూ ఒక స్త్రీనే అన్న భువనేశ్వరి
నేనూ ఒక స్త్రీనే. అది నేను ఎప్పటికీ మరిచిపోను. నేను అట్లాంటిదాన్ని.. ఇట్లాంటిదాన్ని అని. ఎవరికీ నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు మనస్సాక్షి ఉంటుంది. అది మా ఆయన నమ్మితే చాలు. ఎవ్వరు వాగినా నేను పట్టించుకోను. పనిలేని వాళ్లు అట్లాగే వాగుతారు. ఈ సృష్టికి మూలకర్త ఆడది అని మరిచిపోయారు. మీరు బాబు గారి కోసం వచ్చారు. ఎందుకు వచ్చారు. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని తెలిసే కదా మీరు ఇక్కడికి వచ్చి ఆయనకు మద్దతు తెలిపేది. ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేశారు. ఆయన ఏం తప్పు చేశారు. నిర్బంధించే ముందు మనిషిని అడిగారా? ఎంత డబ్బు పోయింది.. ఎక్కడికి పోయింది.. అనేది దాని ముందు దర్యాప్తు చేశారా? ఎంతవరకు అది నిజం, కాదు అనేది ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు. కానీ.. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. ఆయన్ను అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు సీఐడీ దిగుతారు. అప్పుడు ప్రశ్నిస్తారు. నాకు బాగా నమ్మకం.. ఆయనే తిరిగి వాళ్లను ప్రశ్నిస్తారని. వాళ్లకు కూడా తెలుసు.. చంద్రబాబు గురించి. ఇప్పుడు ఆయన్ను నిర్బంధించి జైలులో పెట్టారు.. అంటూ భువనేశ్వరి వాపోయారు.