Bandi Sanjay : CP రంగనాథ్ బీజేపీ బండి సంజయ్ లా మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ వీడియో..!!
Bandi Sanjay : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్ట్ కావటం తెలిసిందే. ఆ తర్వాత బండి సంజయ్ కి బెయిల్ రావడం జరిగింది. ఈ క్రమంలో తనని అరెస్టు చేసిన పోలీస్ వ్యవస్థ పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా సీపీ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. విజయవాడలో…నల్గొండలో ఏం చేస్తావో అన్ని మాకు తెలుసు. నీ ఆస్తి పాస్తులు ఏంతో నాకు తెలుసు. నువ్వు ఎవరికి కొమ్ముకాస్తున్నవో తెలుసు. ఎక్కడ దందా చేస్తున్నావో అన్ని మా దగ్గర ఉన్నాయి.
సిపి రంగనాథ్ ఏ రోజు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. నువ్వు తప్పు చేయలేదని నీ కాకి దుస్తులపై ప్రమాణం చేయి అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. సంబంధం లేని వారిపై కేసులు పెట్టడానికి అమాయకుల పైన కేసులు పెట్టడానికి… నీకు అధికారం ఇచ్చింది ఎవరు అని నిలదీశారు. ఈ క్రమంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సిపి రంగనాథ్ స్పందించారు. నేను సెటిల్మెంట్ దందాలు చేసే అక్రమాస్తుల సంపాదించాను అని నిరూపిస్తే ఈ క్షణం ఉద్యోగం విడిచి వెళ్ళిపోతానని ప్రతి సమావేశాలు.
వరంగల్ కి వచ్చి ఐదు నెలలు అవుతుంది అంతకుముందు ఖమ్మం మిగతా ప్రాంతాల్లో విధులు నిర్వహించటం జరిగింది. అయితే నేను ఒక్క సెటిల్మెంట్ చేసినట్లు… ఒక దందా చేసినట్లు… నాకు లాభం వచ్చినట్లు నేను చేసి ఉంటే.. ఉద్యోగం విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వ్యక్తిగతంగా మిమ్మల్ని అరెస్టు చేస్తే మాకేం ఉంటది. ఉద్యోగ పరంగా చేసినటువంటి దర్యాప్తులో… భాగం ఇది. బీజేపీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టాలని ఆలోచన కూడా మాకు లేదు అంటూ సిపి రంగనాథ్.. కౌంటర్ కామెంట్లు చేయడం జరిగింది. సిపి రంగనాథ్ వర్సెస్ బండి సంజయ్ మధ్య జరిగిన ఈ డైలాగు వారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.