Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాలజీ.. ఇకపై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు
ప్రధానాంశాలు:
Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాలజీ.. ఇకపై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది. ఆ తరువాత ఈ-పాస్ యంత్రాల ద్వారా ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్‌తో రేషన్ పంపిణీ ప్రారంభమైంది. అయితే ఈ పద్ధతుల్లో నెట్‌వర్క్ సమస్యలు ఎదురవడంతో ప్రజలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది.

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాలజీ.. ఇకపై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు
Ration : బెస్ట్ ఆప్షన్..
ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది.ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇందులో Android ఫోన్ కెమెరా ద్వారా లబ్ధిదారుల ముఖాన్ని స్కాన్ చేసి, వారికి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇది దేశంలో తొలిసారి పూర్తిస్థాయిలో అమలవుతున్న పరిజ్ఞాన పద్ధతి. Android స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న స్పెషల్ ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా లబ్ధిదారుల ముఖాన్ని స్కాన్ చేస్తారు.
స్కాన్ చేసిన వెంటనే, ఆయా వ్యక్తి ఆధార్‌తో లింక్ అయిన రేషన్ కార్డు వివరాలు వెలువడతాయి.తద్వారా, ఏ కుటుంబ సభ్యుని పేరు మీదనైనా సరుకులు పంపిణీ చేయవచ్చు.ఇది ఫింగర్ ప్రింట్ / ఐరిస్ స్కాన్ అవసరం లేకుండా, నెట్‌వర్క్ లేకపోయినా పని చేయగలదు. నెట్‌వర్క్ లోపాలను అధిగమించే అవకాశం. దీని ద్వరా బయోమెట్రిక్ మ్యాచింగ్ లోపాలతో వచ్చే సమస్యలకు పరిష్కారం ఉంటుంది.ఇందుకు త్వరితగతిన సేవలు ప్రారంభం కానున్నాయి. ఇది మొదటగా బిలాస్‌పూర్ జిల్లాలో ట్రయల్ రన్ ద్వారా పరీక్షించబడింది. విజయవంతమవడంతో, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.