Big Breaking : కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్.. షాక్ లో కేసీఆర్
Big Breaking : హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హైదరాబాద్ ను పట్టించుకున్న నాథుడు లేడు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ను డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ అభివృద్ధి జరిగి వ్యాపారాలు పెరిగి చాలా రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఇక్కడికి వలస వచ్చారు. అయినా కూడా సౌత్ ఇండియా అంటే నార్త్ కు ఎప్పుడూ చిన్నచూపే. అందుకే హైదరాబాద్ కూడా ఎక్కువగా ఎలివేట్ కాలేకపోయింది. కానీ.. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో.. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ అయిందో.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి.
ఆనాడు హైదరాబాద్ కు ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చి హైదరాబాద్ గురించి ప్రపంచానికి పరిచయం చేసిన చంద్రబాబు ఎలా అందరికీ గుర్తుండిపోయారో.. ఈనాడు అదే ఐటీ ఇండస్ట్రీని దేశంలోనే నంబర్ వన్ గా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్ గురించి ప్రపంచం మాట్లాడుకుంటోంది. దేశంలోనూ మెట్రో సిటీల్లో నెంబర్ వన్ గా ఉంది. హైదరాబాద్ నగరం రూపురేఖలన్నీ ఒక్క 10 ఏళ్లలోనే మారిపోయాయి.మిగితా మెట్రో సిటీలతో పోల్చితే గత 10 ఏళ్లలో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. అందుకే ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ పై పడింది. హైదరాబాద్ మాత్రమే కాదు.. బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి మెట్రో నగరాలపై కూడా కేంద్రం కన్ను పడింది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
Big Breaking : అందుకే హైదరాబాద్ పై కేంద్రం కన్ను
దానికి బలం చేకూరేలా పార్లమెంట్ లో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీద్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ మారే రోజు ఎంతో దూరం లేదని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో అసదుద్దీన్ అలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఈ విషయం చర్చనీయాంశం అయింది. హైదరాబాద్ తో పాటు మరికొన్ని మెట్రో నగరాలను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే అవకాశం ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అందుకే అన్ని ప్రాంతీయ పార్టీలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్టు ఆయన చెప్పారు.
https://www.youtube.com/watch?v=-DbaxNea0EU