India Rainfall : రుతుపవనాల విషయంలో ఐ.ఎం.డీ అంచనా తప్పాయెందుకు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

India Rainfall : రుతుపవనాల విషయంలో ఐ.ఎం.డీ అంచనా తప్పాయెందుకు..?

India Rainfall : ఈసారి వేసవిలో మరింత ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఐతే ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో వర్షాలు కూడా అదే రేంజ్ లో పడతాయని అనుకున్నారు. కానీ జూన్ నెల చివరికి వచ్చినా అడపాదడపా తప్ప వర్షాలు అనుకున్న విధంగా పడట్లేదు. అంతేకాదు రుతుపవనాలు వచ్చినా కూడా అనుకున్న దాని కన్నా 19 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో ఐ.ఎం.డీకి షాక్ తగిలినట్టు అయ్యింది. దేశంలో ఐ.ఎం.డీ ఆశించిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 June 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  India Rainfall : రుతుపవనాల విషయంలో ఐ.ఎం.డీ అంచనా తప్పాయెందుకు..?

India Rainfall : ఈసారి వేసవిలో మరింత ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఐతే ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో వర్షాలు కూడా అదే రేంజ్ లో పడతాయని అనుకున్నారు. కానీ జూన్ నెల చివరికి వచ్చినా అడపాదడపా తప్ప వర్షాలు అనుకున్న విధంగా పడట్లేదు. అంతేకాదు రుతుపవనాలు వచ్చినా కూడా అనుకున్న దాని కన్నా 19 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో ఐ.ఎం.డీకి షాక్ తగిలినట్టు అయ్యింది.

దేశంలో ఐ.ఎం.డీ ఆశించిన విధంగా రుతుపవనాలు ముందుకు కదలడం లేదు. నైరుతి రుతుపవనాలు వచ్చినా కూడా వాటి ప్రభవం ఏమాత్రం లేదు. జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఐ.ఎం.డీ అంచనాలను తలకిందలు చేస్తూ 19 శాతం వర్షపాతం తగ్గింది. రుతుపవనాలు వచ్చినా కూడా ఇంకా వర్షపాతం లోటు కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి ఏడాది జూన్ లో నమోదయ్యే వర్షాపాతం కన్నా 19 శాతం తగ్గుముఖంగా ఈసారి వర్షాలు ఉన్నాయి.

India Rainfall జూన్ 12 కే రుతుపవనాలు వచ్చినా

India Rainfall రుతుపవనాల విషయంలో ఐఎండీ అంచనా తప్పాయెందుకు

India Rainfall : రుతుపవనాల విషయంలో ఐ.ఎం.డీ అంచనా తప్పాయెందుకు..?

అసలైతే దేశంలోకి జూన్ 12నే రుతుపవనాలు దేశంలో వచ్చినా దేశం మొత్తం లో ఉన్న 36 సబ్ డివిజన్లలో 21 చోట్ల సాధారణ వర్షపాతం నమోదైందని ఐ.ఎం.డీ చెబుతుంది. ఐతే వర్షాలు అనుకున్న తీరిలో పడకపోవడం వల్ల కొన్నిచోట్ల 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ఇప్పటికీ నమోదవుతున్నాయని తెలుస్తుంది. మరి ఈ పరిస్థితి మారి సకాలంలో వర్షాలు పడితే కానీ మల్లీ ప్రజల ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని ఐ.ఎం.డీ వెల్లడించింది. సాధారణంగా సమ్మర్ లో వేడి ఎంత ఎక్కువగా ఉంటే వర్షాలు కూడా దానికి సమానంగా పడతాయని అంటుంటారు. కానీ ఈసారి జూన్ నెల చివర దాకా ఉష్ణోగ్రత తీవ్రత తగ్గకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది