India : ఇండియాపై కన్నెర్ర చేసిన ప్రకృతి… రిపోర్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి…!
India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ప్రజలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలు.. గజ గజ వణికేలా చలి. ఏది చూసినా.. అసాధారణంగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజులతరబడి ముసురేసి, వాగుల్ని, వంకల్ని ఏకం చేసి జనావాసాల్ని ముంచేసే వర్షాలు.. హో…రుమంటూ తీరాన్ని తాకి బీభత్సం సృష్టించే ప్రళయ భీకర తుఫాన్లు.. మండుటెండలను మించి చుర్రున కాల్చేసే ఎండలు.. తీవ్రమైన కరువు కాటకాలు! …దేశంలోని 85 […]
ప్రధానాంశాలు:
India : ఇండియాపై కన్నెర్ర చేసిన ప్రకృతి... రిపోర్ట్‌తో సంచలన విషయాలు వెలుగులోకి...!
India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ప్రజలని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మండే ఎండలు.. గజ గజ వణికేలా చలి. ఏది చూసినా.. అసాధారణంగా వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. రోజులతరబడి ముసురేసి, వాగుల్ని, వంకల్ని ఏకం చేసి జనావాసాల్ని ముంచేసే వర్షాలు.. హో…రుమంటూ తీరాన్ని తాకి బీభత్సం సృష్టించే ప్రళయ భీకర తుఫాన్లు.. మండుటెండలను మించి చుర్రున కాల్చేసే ఎండలు.. తీవ్రమైన కరువు కాటకాలు! …దేశంలోని 85 శాతానికిపైగా జిల్లాలు ఇటీవలికాలంలో ఇలాంటి అసాధారణ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటున్నాయని ఐపీఈ గ్లోబల్, ఈఎ్‌సఆర్‌ఐ-ఇండియా తాజా అధ్యయనం వెల్లడించింది! ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నానాటికీ పెరుగుతున్నట్టు తెలిపింది.
India ప్రకృతి ప్రకోపం..
దేశంలోని 85 శాతానికిపైగా జిల్లాలు వరదలు, కరువు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటున్నాయని తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. ఈ అధ్యయనాన్ని ఐపీఈ గ్లోబల్, ఈశ్రీ ఇండియా సంయుక్తంగా నిర్వహించాయి. 45 శాతం జిల్లాలు ఒకప్పుడు తీవ్ర వరదలను ఎదుర్కొని ఇప్పుడు కరువు బారిన పడటమో.. లేదా తీవ్ర కరువు పరిస్థితుల నుంచి భారీ వరదల పరిస్థితిని ఎదుర్కొనడమో జరుగుతున్నదని తెలిపింది. పెంటా- డికేడల్ అనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి ఈ అధ్యయాన్ని నిర్వహించారు. దీని ద్వారా 1973 నుంచి 2023 వరకూ యాభై సంవత్సరాల తీవ్ర వాతావరణ పరిస్థితులను క్రోడీకరించారు.తూర్పు భారతదేశంలోని జిల్లాలు తరచూ భారీ వరదలకు గురవుతున్నాయని నివేదిక పేర్కొన్నది. తర్వాతి స్థానాల్లో ఈశాన్య, దక్షిణ భారతదేశ జిల్లాలు ఉన్నాయి. కరువు పరిస్థితులు రెండింతలు పెరిగాయని అధ్యయనం తెలిపింది.
తుఫానుల వంటివి నాలుగింతలు పెరిగాయని తెలిపింది. బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో తీవ్ర ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి పది మంది భారతీయుల్లో 9 మంది తీవ్ర ప్రకృతి వైపరీత్యాలకు గురవుతున్నారని ఐపీఈ గ్లోబల్‌లోని క్లయిమేట్ చేంజ్ అండ్ సస్టయినబిలిటీ ప్రాక్టీస్ అధిపతి, నివేదిక రచయిత అబినాష్ మొహంతి చెప్పారు. గత శతాబ్దంలో ఉష్ణోగ్రతలు 0.6 డిగ్రీల సెల్సియస్ పెరగడమే దీనికి కారణమని ఆయన వివరించారు. 2036 నాటికి 147 కోట్ల మంది భారతీయులు తీవ్ర వాతావరణ మార్పులకు ప్రభావితమవుతారని తమ విశ్లేషణ పేర్కొంటున్నదని మొహంతి తెలిపారు. 45 శాతం జిల్లాలు ప్రకృతి వైపరీత్యాల బదలాయింపులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. తరచూ వరదలకు గురయ్యే ప్రాంతాల్లో కరువు తాండవిస్తున్నదని, కరువు ఛాయలు ఎదుర్కొన్నవి ఇప్పుడు భారీ వరదలను చవిచూస్తున్నాయని ఆయన తెలిపారు