India Pakistan War : భారత్ – పాక్ యుద్ధం మొదలైంది.. LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

India Pakistan War : భారత్ – పాక్ యుద్ధం మొదలైంది.. LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 April 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  India Pakistan War : భారత్ - పాక్ యుద్ధం మొదలైంది.. LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్..!

India Pakistan War : భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది. లైన్ ఆఫ్ కంట్రోల్ (LOC) వెంబడి పాకిస్థాన్ ఆర్మీ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు తెగబడింది. మొత్తం మూడు వేర్వేరు ప్రాంతాల్లోని పాక్ పోస్టుల నుంచి భారత భూభాగంపై టార్గెట్ చేసి భారీగా కాల్పులు జరిపారు. ఈ యుద్ధం తో ఆ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పాక్ కుట్రకు భారత ఆర్మీ గట్టి ప్రతిచర్యగా బదులిచ్చింది. శత్రు గుణాలు చూపుతున్న పాక్ సైనిక స్థావరాలపై సమర్థవంతంగా కౌంటర్ ఫైర్ జరిపింది.

India Pakistan War భారత్ పాక్ యుద్ధం మొదలైంది LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్

India Pakistan War : భారత్ – పాక్ యుద్ధం మొదలైంది.. LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్..!

India Pakistan War LOC వెంబడి కాల్పులకు తెగబడిన పాక్..

ఎదురుకాల్పుల నేపథ్యంలో నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. భారత సైన్యం తన సరిహద్దులను రక్షించడంలో ఏ విషయంలోనూ వెనుకాడదని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఘటనల నేపథ్యంలో LOC వెంబడి గ్రామాల వద్ద అప్రమత్తత పెంచినట్లు అధికారులు తెలిపారు. పాక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తరచూ కాల్పులకు పాల్పడుతుండటం గమనార్హం. ఈ పరిణామాలు భారత్-పాక్ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతను తీసుకురావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటె భారత నావికాదళానికి చెందిన పూర్తి స్వదేశీ యుద్ధనౌక INS సూరత్ క్షిపణిని అరేబియా సముద్రంలోని లక్ష్యంపై విజయవంతంగా ప్రయోగించింది. సముద్ర-స్కిమ్మింగ్ లక్ష్యాన్ని చేధించింది.

ఈ పరీక్ష భారత నావికాదళం వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం వైపు మరో బలమైన అడుగు పటినట్లైంది. INS సూరత్ అనేది భారత నావికాదళంతాజా గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక. ఇది పూర్తిగా భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ నౌక. ఈ నౌకలో ఆధునిక ఆయుధాలు, సెన్సార్లు అమర్చబడి ఉన్నాయి. ప్రత్యక్ష కార్యాచరణ పరిస్థితుల్లో లక్ష్యాన్ని ఖచ్చితంగా చేధించడం ద్వారా ఇది తన సామర్థ్యాలను ప్రదర్శించింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది