Chiranjeevi : టీడీపీ ట్రాప్‌లో పడిన చిరంజీవి.. దీని వెనుక ఉండి నడిపిస్తుందేవ‌రు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : టీడీపీ ట్రాప్‌లో పడిన చిరంజీవి.. దీని వెనుక ఉండి నడిపిస్తుందేవ‌రు..?

 Authored By kranthi | The Telugu News | Updated on :11 August 2023,9:00 am

Chiranjeevi: ప్రస్తుతం ఏపీలో సినిమా ఇండస్ట్రీ వర్సెస్ రాజకీయాలు అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే.. వాల్తేరు వీరయ్య 200వ రోజు వేడుకల్లో చిరంజీవి ఏపీ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. కానీ.. చిరంజీవి మాట్లాడిన మాటలను, చేసిన విమర్శలను హైలెట్ చేస్తున్నారు. కానీ.. ఆయన ఎందుకు అలా చేశారు అనేది మాత్రం ఎవ్వరూ ఆలోచించడం లేదు. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానే రేపాయి. అసలే తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి చివరకు ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపారు. కొన్నేళ్లు కేంద్ర మంత్రిగానూ పని చేసి ఆ తర్వాత బాబోయ్ నాకొద్దు రాజకీయాలు అన్నట్టుగా వాటిని వదిలేసి కేవలం సినిమాల మీదనే ఫోకస్ పెట్టారు.

అంతవరకు బాగానే ఉంది కానీ.. సడెన్ గా ఎన్నికల వేళ చిరంజీవి.. ఏపీ ప్రభుత్వంపై ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటి. దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై ఆరా తీస్తే చిరంజీవి ఏకంగా టీడీపీ ట్రాప్ లో పడ్డారు అని అంటున్నారు జనాలు. నిజానికి టీడీపీ కన్ను చిరంజీవిపై ఎప్పుడో పడింది. కానీ.. చిరంజీవి టీడీపీ పార్టీలో ఏనాడూ చేరలేదు. ఆ పార్టీకి అనుకూలంగానూ ఏనాడూ మాట్లాడలేదు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ పెట్టకముందు.. పెట్టిన తర్వాత కూడా టీడీపీకి అనుకూలంగానే ఉన్నారు. ఇప్పటికీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ కంటే ముందు టీడీపీ సీరియస్ గా తీసుకుంది. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ బాబు ఇద్దరూ చిరంజీవిని వెనకేసుకొస్తూ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. అయితే.. చిరంజీవిని తమ వైపునకు తిప్పుకునేందుకు ఇదంతా టీడీపీ వేసిన ప్లాన్ అని..

chiranjeevi trapped by tdp

chiranjeevi trapped by tdp

Chiranjeevi : పవన్ ను అడ్డం పెట్టుకొని టీడీపీ ఆడిస్తున్న నాటకమా ఇది?

తన తమ్ముడు పవన్ ను అడ్డం పెట్టుకొని ఇదంతా టీడీపీ నడిపిస్తోందని.. వైసీపీని నేరుగా తిట్టడం కంటే కూడా ఒక ప్రముఖ వ్యక్తి విమర్శించేలా చేస్తే అది ఖచ్చితంగా వైసీపీకి మైనస్ అవుతుంది. దాన్ని మనం క్యాష్ చేసుకోవాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోందని.. దానికి ప్రతిఫలమే చిరంజీవి ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరగడం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి.. దీని వెనుక తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఒక్కటే కదా. చూడాలి మరి.. చిరంజీవిని ఇంకా ఎన్నికల్లోపు ఎలా వాడుకుంటారో?

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది