Jaya Prakash Narayana : జగన్ లాంటి దమ్మున్న లీడర్‌ను చూడలేదు.. వైఎస్సార్‌ను మించిపోయాడు.. మళ్లీ నువ్వే సీఎం.. జయప్రకాశ్ నారాయణ కితాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jaya Prakash Narayana : జగన్ లాంటి దమ్మున్న లీడర్‌ను చూడలేదు.. వైఎస్సార్‌ను మించిపోయాడు.. మళ్లీ నువ్వే సీఎం.. జయప్రకాశ్ నారాయణ కితాబు

 Authored By kranthi | The Telugu News | Updated on :12 October 2023,7:00 pm

Jaya Prakash Narayana : ప్రజా సేవలో వైఎస్సార్ ను మించిపోయాడు. మళ్లీ నువ్వే సీఎం.. నీకు తిరుగులేదయ్యా.. జగన్ లాంటి దమ్మున్న లీడర్ ను చూడలేదు.. జగనన్న ఆరోగ్య సురక్షా స్కీమ్ పై జయప్రకాశ్ నారాయణ.. సీఎం జగన్ ను కొనియాడారు. ఏపీలో ఆరోగ్య సురక్ష పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్లే ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామానికి ఆరోగ్య కార్యకర్తలను పంపించి ఒక స్క్రీనింగ్ చేయడం.. ఒక బేస్ లైన్.. అక్కడ ఆరోగ్యం ఎలా ఉందో చెక్ చేయడం.. హెల్త్ రికార్డ్స్ ను డిజిటలైజ్ చేసే ప్రక్రియ ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది. ఆరోగ్య రంగంలో ఏ శ్రద్ధ చూపెట్టినా కూడా మనం దాన్ని ఆహ్వానించాలి. వివిధ రాష్ట్రాల్లో గత 15 నుంచి 20 సంవత్సరాలుగా కొంత ప్రయత్నం అయితే జరుగుతోంది అని జయ ప్రకాష్ నారాయణ అన్నారు.

మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే వైఎస్సార్ కాలంలో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. అలాగే.. ఇప్పుడు ఆరోగ్య సురక్షను తీసుకొచ్చారు. మన దేశంలో అనారోగ్య కారణాలుగా, ఆరోగ్య సమస్యల వల్ల.. అనారోగ్యానికి డబ్బులు పెట్టలేక కోట్ల మంది ఇంకా పేదరికంలో మగ్గిపోతున్నారు. అలాంటి దేశంలో ప్రభుత్వాలు ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే మనం ఆహ్వానించాలి. అందులోనూ మనకు దీర్ఘకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్, అంటు వ్యాధులు, బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే సగటు వయసు పెరుగుతోందో జీవనశైలి మారుతోందో దీర్ఘకాల వ్యాధులు పెరుగుతున్నాయని జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.

jayaprakash narayana great words about cm ys jagan

#image_title

Jaya Prakash Narayana : ఆరోగ్యశ్రీ అందుకే సక్సెస్ అయిందన్న జయప్రకాష్ నారాయణ

దీర్ఘకాలిక వ్యాధుల వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి స్క్రీనింగ్ చేయడం, ప్రజలకు అందుబాటులో ఉండటం, హెల్త్ రికార్డ్స్ తయారు చేయడం, ఒక ఎక్సర్‌సైజ్ గా మంచిదే అంటూ జయప్రకాశ్ నారాయణ.. ఏపీ ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆరోగ్యశ్రీలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. మీకు నచ్చిన ఆసుపత్రికి వెళ్లొచ్చు. ప్రభుత్వం కొన్ని ఆసుపత్రుల లిస్టును ఇస్తుంది. మీకు ఏది నచ్చితే ఆ ఆసుపత్రికే వెళ్లొచ్చు. అందుకే వంద శాతం మేర ఆరోగ్యశ్రీ సక్సెస్ అయింది. రోగికి ఆ తృప్తి ఉంది. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానని. ప్రపంచంలో విద్య, ఆరోగ్యం అధ్వాన్నంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. ఈ రెండు రంగాల్లో ఎక్కడ దృష్టి పెట్టినా మనం దాన్ని ఆహ్వానించాలి.. ప్రోత్సహించాలని జయ ప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది