Kargil Victory Day : కార్గిల్ విజయ దినోత్సవం నాడు ఈ కార్గిల్ వీరుడి కథ తెలుసుకోవాల్సిందే
ప్రధానాంశాలు:
కార్గిల్ దినోత్సవం నాడు 'పరమవీర చక్ర' కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే స్టోరీ తెలుసుకోవాల్సిందే
Kargil Victory Day : కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే పేరు వినగానే దేశభక్తి, ధైర్య సాహసాలు, సేవాభావం ఒకేసారి గుర్తుకొస్తాయి. “నాకు పరమవీర చక్ర గెలవాలని ఉంది” అని సైన్యంలో చేరినప్పుడు చెప్పిన మాటలు.. చివరికి నిజం కావడం వెనుక ఆయన చేసిన త్యాగం, చేసిన సాయం గొప్పది. కార్గిల్ యుద్ధ సమయంలో ఖలుబార్ టాప్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందుండి పోరాడిన మనోజ్.. గాయాలపై గాయాలు అయినా వెనక్కు తగ్గలేదు. చివరికి నాలుగో బంకర్‌ను ధ్వంసం చేస్తూ వీర మరణం పొందారు…
Kargil Victory Day : కార్గిల్ విజయ దినోత్సవం నాడు ఈ కార్గిల్ వీరుడి కథ తెలుసుకోవాల్సిందే
Kargil Victory Day : కార్గిల్ వీరుడు మనోజ్ కుమార్ పాండే ధైర్యానికి చావు సైతం భయపడింది
మూడు బంకర్లను ధ్వంసం చేసి నాలుగో బంకర్‌ను ఛేదించడానికి వెళ్లినప్పుడు ఆయనపై వచ్చిన బుల్లెట్లు, చివరి శ్వాస వరకు పోరాడిన విక్రమం, ఆయన దేశభక్తిని తెలిపే అపూర్వ ఘట్టం. జెండా పైన కప్పుకుని వచ్చిన శరీరంతో తల్లికి ఇచ్చిన మాటను తీరుస్తూ.. తానే ఓ జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఉదాహరణ. మనోజ్ పాండే కథలో సియాచిన్ శీతల గాలులనుంచి కార్గిల్ యుద్ధ తాపం వరకూ ఉన్న ప్రతి క్షణం ఓ స్ఫూర్తి.
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపుర్ జిల్లాలో జన్మించిన మనోజ్ చిన్ననాటి నుంచే సైన్యంలో చేరాలన్న లక్ష్యంతో ముందుకు సాగారు. స్కాలర్‌షిప్‌లో చదివి, శిక్షణ పొందుతూ ఓ పక్క తల్లిదండ్రులను ప్రేమించి.. దేశాన్ని తల్లి లా పిలిచిన గొప్ప వ్యక్తి. అమ్మకు అవసరం ఉన్నా స్కాలర్‌షిప్ డబ్బులు నాన్నకు కొత్త సైకిల్ కొట్టేందుకు వాడిన మనోజ్.. తన పిల్లనగ్రోవిని ఏటేటా మర్చకుండా తీసుకెళ్లిన మనోజ్.. తల్లిదండ్రుల ప్రేమ, దేశసేవ మేళవించిన రుజువు. దేశం కోసం పుట్టినవారు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారనడానికి ఇదొక ఉదాహరణ.
కెప్టెన్ మనోజ్ పాండే జీవితం నుంచి ప్రతీ భారతీయ యువకుడు నేర్చుకోవలసింది ఒక్కటే . దేశాన్ని ప్రేమించాలి, దేశ సేవను గౌరవించాలి. దేశం మనకోసం ఏం చేస్తుందో కాదు.. మనం దేశానికి ఏం చేస్తున్నామో ఆలోచించాలి. ‘దేశం అంటే మట్టికాదు.. మనుషులు’ అని గురజాడ అన్నట్లు.. ఈ దేశ ప్రజల కోసం, వారి భద్రత కోసం మనోజ్ లాంటి సైనికులు ప్రాణాలిచ్చారు. అలాంటి మహానుభావులను మర్చిపోకుండా, వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ముందుకు సాగడం మన బాధ్యత.