kcr : ఒక సందర్భంలో ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ది ఒక వేటగాడి నైజం.. ఎప్పుడు ఎదో ఒక వేట ఆడకపోతే ఆయనకు మజా ఉండదు అంటూ మాట్లాడాడు. తెరాస పార్టీలో జరుగుతున్నా కొన్ని సంఘటనలు చూస్తే రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఉందని అనిపిస్తుంది. గులాబీ పార్టీలో పైకి తెలియకుండా లోలోపల ఎప్పుడు ఎవరో ఒకరి మీద వేట కొనసాగుతూనే ఉంటుందని తెరాస వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఉద్యమ సమయంలో అందరితో కలిసి పోరాటం చేసిన కేసీఆర్ kcr, అధికారంలోకి వచ్చిన తర్వాత మెల్ల మెల్లగా తనతో కలిసి పనిచేసిన ఉద్యమ నేతలను, పార్టీలో తనకు సమ ఉజ్జివులుగా ఎదుగుతారని భావించే వ్యక్తులను బయటకు పంపించటంతో లేక పార్టీలోనే ఉండేలా చేసి ఎలాంటి అధికారాలు లేకుండా మూలాన పడేయటంతో చూస్తూనే ఉన్నాడని కొందరు విశ్లేషకులు చెపుతున్న మాట.
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ప్రక్షాళనే లక్ష్యంగా అన్నట్లు కేసీఆర్ kcr వ్యవహరిస్తూ వచ్చాడు. మొదటిసారి మంత్రి పదవులు ఇచ్చిన కొందరు నేతలకు రెండో సారి కనీసం ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇవ్వలేదు కేసీఆర్. ముందుగా సీనియర్ నేత కడియం శ్రీహరికి చెక్ పెట్టె ఉదేశ్యంతో రాజయ్య ను పోటీగా దించాడు. ఆ తర్వాత శ్రీహరిని మరింత ఇబ్బంది పెట్టటానికి ఎర్రబెల్లి దయాకర్ కు మంత్రి పదవి ఇవ్వటమే కాకుండా వరంగల్ లో పెత్తనం మొత్తం దయాకర్ కు ఇవ్వటంతో కడియం శ్రీహరి సైలెంట్ అయ్యిపోయి, పార్టీలో ఉండలేక అలాగని బయటకు వెళ్లలేక కాలం వెల్లడిస్తున్నారు.
ఆ తర్వాత ఉద్యమ నేత స్వామి గౌడ్ విషయంలో కూడా కేసీఆర్ తన వ్యూహం అమలు చేసి ఆయన్ని పార్టీ నుండి వెళ్లేలా చేశాడనే టాక్. అతని తర్వాత ఖమ్మంలో కీలక నేతైనా తుమ్మల నాగేశ్వర రావుకు చెక్ పెట్టటానికి పువ్వాడ అజయ్ ను తెర మీదకు తెచ్చి క్రమంగా తుమ్మల హవాకు చెక్ పెట్టాడు. మొన్న జరిగిన ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో పెత్తనం మొత్తం పువ్వాడ అజయ్ దే సాగింది.. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది నేతలు కేసీఆర్ వేటలో చిక్కున్నారని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట.
అయితే కేసీఆర్ ఇదంతా ఎందుకు చేస్తున్నారయ్యా అంటే కేవలం తన కొడుకు కేటీఆర్ భవిష్యత్ కోసమే అనే మాటలు వినిపిస్తున్నాయి. తెరాస పార్టీలో కేటీఆర్ కంటే సీనియర్ నేతలు, ఉద్యమ నేతలు ఉంటె రాబోయే రోజుల్లో వ్యతిరేక స్వరం వినిపించటం, లేదా కేటీఆర్ మాటకు విలువ ఇవ్వరనే ఉద్దేశ్యంతోనే పార్టీలో పాత తరం నేతలు లేకుండా కేసీఆర్ జాగ్రత్త పడుతున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి ఉద్యమ పార్టీలో వారసత్వానికి అవకాశం లేదు. ఉద్యమ నేత తర్వాత ఆ స్థాయి కలిగిన మరోనేతకే పార్టీ పగ్గాలు రావాలి.. అలా జరగటం ఇష్టం లేకనే కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నాడు అనే వాదనను కొందరు వినిపిస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.