Kejriwal Arrest : సీఎం ప‌ద‌విలో ఉన్న వ్యక్తే అరెస్ట్‌.. క‌విత అరెస్ట్ ఓ లెక్క‌నా.. గులాబీ ద‌ళాలు చిందులు త‌గ్గించాలి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kejriwal Arrest : సీఎం ప‌ద‌విలో ఉన్న వ్యక్తే అరెస్ట్‌.. క‌విత అరెస్ట్ ఓ లెక్క‌నా.. గులాబీ ద‌ళాలు చిందులు త‌గ్గించాలి..! 

 Authored By ramu | The Telugu News | Updated on :22 March 2024,1:05 pm

ప్రధానాంశాలు:

  •  Kejriwal Arrest : సీఎం ప‌ద‌విలో ఉన్న వ్యక్తే అరెస్ట్‌.. క‌విత అరెస్ట్ ఓ లెక్క‌నా.. గులాబీ ద‌ళాలు చిందులు త‌గ్గించాలి..! 

Kejriwal Arrest : ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం  Delhi Liquor Case కేసు ఎన్నికల సమయంలో ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కూతురు క‌విత‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి త‌ర‌లించారు. ఇక తాజాగా మనీ ల్యాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. అప్పటి ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను 2023 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేయగా, బెయిల్‌పై విడుదలైన తర్వాత అదే ఏడాది మార్చిలో ఈడీ ఆయన్ను అరెస్ట్ చేయ‌గా, ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.మ‌రి ఎన్నిక‌ల ముందు కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే కవిత MLC kalvakuntla kavitha అరెస్ట్‌కి వ్యతిరేఖంగా హ‌రీష్ రావు, Harish Rao కేటీఆర్  KTR వంటి వారు వ్యూహ ర‌చ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ Kejriwal Arrest కావ‌డంతో కొంద‌రు విశ్లేష‌కులు అర‌వింద్ అరెస్ట్ ముందు క‌విత అరెస్ట్ ఎంత‌? గులాబీ ద‌ళాలు చిందులు తొక్క‌కుండా సైలెంట్‌గా ఉంటే మంచిద‌ని అంటున్నారు. ఈడీ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన కొద్ది గంటలకే కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకోవ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌ద్యం పాల‌సీ కేసులో ఈడీ తొమ్మిది సార్లు కేజ్రీవాల్‌కి స‌మ‌న్లు జారీ చేసింది. అయిన కూడా ఏనాడు హాజ‌రు కాలేదు. ఇటీవ‌ల మనీల్యాండరింగ్ కేసులో ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది.

Kejriwal Arrest సీఎం ప‌ద‌విలో ఉన్న వ్యక్తే అరెస్ట్‌ క‌విత అరెస్ట్ ఓ లెక్క‌నా గులాబీ ద‌ళాలు చిందులు త‌గ్గించాలి

Kejriwal Arrest : సీఎం ప‌ద‌విలో ఉన్న వ్యక్తే అరెస్ట్‌.. క‌విత అరెస్ట్ ఓ లెక్క‌నా.. గులాబీ ద‌ళాలు చిందులు త‌గ్గించాలి..!

ఈడీ బృందం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను తనతో పాటు ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్ల‌డంతో అక్క‌డ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ రభస సృష్టిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు డ్రోన్లతో ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు..నిజాయితీ గ‌ల అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న కేజ్రీవాల్ ఈ కేసు నుండి బ‌య‌ట‌ప‌డేందుకు నానా తంటాలు ప‌డ్డారు. 9 సార్లు నోటీసులు పంపిన ఏదో ర‌కంగా త‌ప్పించుకుంటూనే వ‌స్తున్న‌డు.విచార‌ణ ఎగ్గొట్టాడానికి కోర్టుని ఆశ్ర‌యించేవాడు. కాని చివ‌రికి ఈ కేసుని విచారిస్తున్న రౌజ్ అవెన్యూ కోర్టు, హైకోర్టు ఈడీ విచార‌ణ‌ని అడ్డుకోలేమ‌ని చెప్ప‌డంతో కొద్ది నిమిషాల‌లోనే ఆయ‌న‌ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్ప‌టివ‌ర‌కు ప‌దవికి రాజీనామా చేసి అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు ముఖ్య‌మంత్రులు ఉండ‌గా, ప‌దవిలో ఉండి అరెస్ట్ అయిన తొలి ముఖ్య మంత్రి కేజ్రీవాలే కావ‌డం విశేషం.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది