arvind kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చారిత్రాత్మక నిర్ణయం.. ఇప్పుడు అంతా అదే దారిలో నడవాల్సిందే
arvind kejriwal : కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రికల్ కార్లు బస్సులను ఉపయోగించాలంటూ ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. కాని ఇప్పటి వరకు కనీసం 1 శాతం వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించడం లేదు. ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నా కూడా విద్యుత్ వాహనాల పట్ల ప్రజలు ఆసక్తి చూపడం లేదు. మొదట ప్రజల్లో మార్పు రావడం కంటే మనమే ముందు మారుదాం అనుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఛారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ విభాగాలు అన్ని కూడా ఇకపై విద్యుత్ వాహనాలు వాడాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
విద్యుత్ వాహనాల వినియోగం తప్పనిసరి…: arvind kejriwal
ప్రభుత్వ అవసరాలకు వినియోగించే ప్రతి వాహనం కూడా విద్యుత్ వాహనంగా మార్చడం వల్ల చాలా వరకు కాలుష్యం తగ్గుతుంది. ప్రభుత్వ వాహనాలను విద్యుత్ వాహనాలకు షిప్ట్ చేయడం అనేది అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలుష్య నివారణ కోసం ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలను వాడాలంటూ మోడీ ప్రభుత్వం సూచనలు అయితే చేస్తుంది కాని ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేసిందే లేదు. ఇప్పుడు కేజ్రీ వాల్ ప్రభుత్వం నుండి వచ్చిన ఈ ప్రకటన నిజంగా అద్బుతం అంటూ ఈ సందర్బంగా కేజ్రీవాల్ అభిమానులు అంటున్నారు. ఢిల్లీలో కాలుష్యం కోరలు చాచింది. ఎంతో మంది పెద్ద ఎత్తున కాలుష్యం కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
కేజ్రీవాల్ నిర్ణయంను మోడీ పాటించాలి..: arvind kejriwal
ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమంత్రులు మరియు మంత్రులు ఇతర ప్రభుత్వ అధికారులు అంతా కూడా ఇలా విద్యుత్ వాహనాలను వాడటం వల్ల చాలా వరకు విద్యుత్ వాహనాల గురించిన అవగాహణ పెంచిన వారు అవుతారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వాహనాలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాలంటూ పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. మొదటగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఉత్తమంగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని అభినందించడంతో పాటు తమ కేబినేట్ మంత్రులు అధికారులు సెక్యూరిటీ ఇలా ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్ వాహనాలను సమకూర్చితే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.