Prasanna Shankar : నా భర్త కామపిశాచి… కాదు నా భార్యకు ఎఫైర్ ఉంది..!
ప్రధానాంశాలు:
Prasanna Shankar : నా భర్త కామపిశాచి... కాదు నా భార్యకు ఎఫైర్ ఉంది..!
Prasanna Shankar : సాధారణ కుటుంబంలో జన్మించి, కోట్లాది రూపాయల విలువైన కంపెనీల అధిపతిగా ఎదిగిన ప్రసన్న శంకర్ నారాయణ ప్రస్తుతం వివాదాల్లో నిలుస్తున్నారు. రిప్లింగ్ అనే HR టెక్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడిగా, సింగపూర్‌కు చెందిన క్రిప్టో సోషల్ నెట్‌వర్క్ 0xPPL.com వ్యవస్థాపకుడిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని , అనేక స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టిన ఆయన, ప్రస్తుతం అమెరికాలో స్థిరపడ్డారు. అయితే, ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం వివాదంగా మారింది.

Prasanna Shankar : నా భర్త కామపిశాచి… కాదు నా భార్యకు ఎఫైర్ ఉంది..!
Prasanna Shankar రోజుకో మలుపు తిరుగుతున్న శంకర్ – దివ్య ల వ్యవహారం
తన భార్య దివ్యతో మనస్పర్థలు రావడంతో, ఈ దంపతులు అమెరికా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. వీరికి తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రసన్న తన ట్విట్టర్ వేదికగా భార్య దివ్య వివాహేతర సంబంధం కలిగి ఉందని, దీనివల్లే వారి మధ్య గొడవలు పెరిగాయని ఆరోపించారు. దివ్య మాత్రం ప్రసన్నను కామపిశాచిగా పేర్కొంటూ, ఆయన రహస్యంగా మహిళల వీడియోలు రికార్డ్ చేసేవాడని సంచలన ఆరోపణలు చేశారు. తన పేరిట ఉన్న ఆస్తులను కూడా ప్రసన్న బదలాయించుకున్నాడని దివ్య ఆరోపించారు.
ఈ ఆరోపణలపై విచారణ చేసిన సింగపూర్ పోలీసులు, ప్రసన్న శంకర్ నారాయణకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే, చెన్నైకి వచ్చిన దివ్య తన కుమారుడిని ప్రసన్న కిడ్నాప్ చేశాడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రసన్న కుమారుడు తన దగ్గర సంతోషంగా ఉన్నాడని, ఆడుకుంటున్న వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు, చెన్నై పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా రూ.25 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించారు. అమెరికా, సింగపూర్ కోర్టుల తీర్పులను ప్రసన్న సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.