Kodali Nani : ఆంబోతు అచ్చెన్నాయుడు, కుక్కలా మొరిగే బుద్ధా వెంకన్న అంటూ కొడాలి నాని ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodali Nani : ఆంబోతు అచ్చెన్నాయుడు, కుక్కలా మొరిగే బుద్ధా వెంకన్న అంటూ కొడాలి నాని ఫైర్

 Authored By brahma | The Telugu News | Updated on :16 March 2021,6:00 pm

Kodali Nani : మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెంది తీవ్ర ఆవేదనలో ఉన్న చంద్రబాబుకు ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే మరో భారీ షాక్ తగిలింది. నవ్యాంధ్ర రాజధానిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇవాళ ఉదయం సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విదితమే. ఈ నోటీసులివ్వడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా తప్పు పడుతూ జగన్ మీద వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణల చేస్తున్నారు.

Kodali Nani fires at achennayudu and buddha venkanna

Kodali Nani fires at achennayudu and buddha venkanna

Kodali Nani : ఎవరిని వదిలేది లేదు : కొడాలి నాని

దీనిపై మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయంలో మీడియా మీట్ నిర్వహించి మాట్లాడటం జరిగింది. అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కాంలు చేశారని సంచలన ఆరోపణలు చేశారు.సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో, దళిత వర్గాలను మోసం చేశారని నాని వ్యాఖ్యానించారు. ఆంబోతులా అచ్చెన్నాయుడు అరుస్తున్నా.. కుక్కలా బుద్ధ వెంకన్న మొరుగుతున్నా మేం అదిరేది లేదు, బెదిరేది లేదు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కాం లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి..?’ అని కొడాలి నాని ప్రశ్నించారు.

‘అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కు దారులైన దళిత వర్గాలను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కో పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలి. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలో అవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాలకంటే మాకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యం. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలి. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం. దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలి’ అని సీఐడీని మంత్రి నాని కోరారు.

tdp party

భగ్గుమన్న టీడీపీ నేతలు

మరోపక్క టీడీపీ నేతలందరూ దీనిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ, కేవలం ఇదీ కక్ష్య సాధింపు కోసమే నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాగైన చంద్రబాబుపై బురద చల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను జైలుకు వెళ్లాడని.. తన దారిలో అందరు జైలుకు వెళ్లాలనే జగన్ ఆలోచన కరెక్ట్ కాదని ఆయన విమర్శించారు.

మరో నేత గోరంట్ల బుచ్చియ్య చౌదరి మాట్లాడుతూ అమరావతి కోసం రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. దాన్ని పక్కదోవ పట్టించేందుకు తప్పుడు కేసులు పెట్టి.. కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఇందులో చంద్రబాబుకు ఎటువంటి సంబంధంలేదని న్యాయస్థానం పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయినా చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని విమర్శించారు. అక్రమాస్తుల్లో 16 నెలలు జైల్లో ఉన్న జగన్… ఇవాళ కేంద్రం దయాదాక్షిణ్యాలతో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలతో కేసుపెడుతున్నారని, ఇది నిలబడదని గోరంట్ల వ్యాఖ్యానించారు.

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది