Kodali Nani : చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికీ రియాక్ట్ అవ్వడు.. ఎందుకంటే?
Kodali Nani : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని స్పందించారు. జగన్ మోహన్ రెడ్డిని ఏం పీకలేవు.. ఏం పీకలేవు అని అన్నారు కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఆయన పీకాడో? ఆయన గురువు గారు.. ఆయన దత్తతండ్రి దారిలోనే నడుస్తున్నాడు. చూద్దాం.. ఏం చేస్తాడో. మామూలుగా అరిచే కుక్క కరవదు అంటారు. కరిచే కుక్క అరవదు అంటారు. అరిచే కుక్క ఎవరో.. కరిచే కుక్క ఎవరో తెలుస్తోంది. ఆయన పావలా కళ్యాణ్ అంటారు కదా. రూపాయి పావలా అంటాడు కదా.. అంటే మాకు 125 సీట్లు వస్తాయని ఆయనే అంటున్నారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ వీళ్లంతా కలిసినా ఏం చేస్తారు. లోకేష్ పుట్టినప్పటి నుంచి చంద్రబాబు కలిసే ఉంటున్నారు. పెళ్లి అయినప్పటి నుంచి చంద్రబాబు, భువనేశ్వరి కలిసే ఉన్నారు కదా. ఏం చేశారు.. అంటూ కొడాలి నాని సీరియస్ అయ్యారు.
మొన్న పల్లాలు కొట్టమన్నారు.. డప్పులు కొట్టమన్నారు. చంద్రబాబు అవినీతి అక్రమాల పుట్ట. ఆయన అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. సీఐడీ కోర్టులో కానీ.. హైకోర్టులో కానీ వాళ్ల వాదనలన్నీ ఒక్కటే. 17ఏ సెక్షన్ ప్రకారం.. చంద్రబాబును అరెస్ట్ చేయడం విరుద్దం. దానికి కారణం.. గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదని చెబుతున్నారు. క్యాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్.. వీటిలో చంద్రబాబు లాయర్లు మాట్లాడేది కూడా ఒక్కటే. చంద్రబాబు అవినీతి చేశాడు. చంద్రబాబు తప్పు చేశాడు. ఈ రాష్ట్ర ఖజానాను దోచుకున్నాడు. కాకపోతే ఈ దొంగను పట్టుకోవడానికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోలేదు కాబట్టి చంద్రబాబు మీద ఫైల్ చేసిన కేసును డిస్మిష్ చేయాలని కోరుతున్నారు. ఇది 2017 లో జరిగిన కేసు. సెక్షన్ 17ఏ రాకముందు జరిగిన కేసు. అదే కాదు.. స్కిల్ డెవపల్ మెంట్ స్కీమ్ కావచ్చు.. రాజధాని భూములు కావచ్చు. రాజధాని రింగ్ రోడ్డు కావచ్చు.. అనేక స్కాములు చేశాడు.. అంటూ కొడాలి నాని చెప్పుకొచ్చాడు.

#image_title
Kodali Nani : చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కలిసి చేసిన కమిషన్ దందాలు ఇవి
2014 లో గెలిచిన తర్వాత కొడుకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమిషన్ల బేరం చేయడం ప్రారంభించారు. నేను అవినీతి చేయలేదు అని.. ఈ కేసుతో సంబంధం లేదు అని వాదిస్తున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. గవర్నర్ పర్మిషన్ కావాలా? ఒక వైపు రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉన్నారు. మీరు గరిటెలు కొట్టినా.. ఇంకేం కొట్టినా రాష్ట్ర ప్రజలు చంద్రబాబును క్షమించరు.. అంటూ కొడాలి నాని సీరియస్ అయ్యారు.