Komatireddy Rajagopal Reddy : ఎన్నికల ముందు ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి.. షాక్‌లో కిషన్ రెడ్డి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Komatireddy Rajagopal Reddy : ఎన్నికల ముందు ట్విస్ట్ ఇచ్చిన కోమటిరెడ్డి.. షాక్‌లో కిషన్ రెడ్డి?

Komatireddy Rajagopal Reddy : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికలకు ఇంకా నెల 10 రోజుల సమయమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. తెలంగాణలో ప్రధాన పోటీ అంటే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలదే ఇక్కడ పోటీ. ఈ మూడు పార్టీలు ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలవాలన్న కసిలో ఉన్నాయి. ఇక.. అధికార బీఆర్ఎస్ పార్టీ తనకున్న అధికారంతో ఎన్నికల సమరాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ అయితే.. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :21 October 2023,5:00 pm

Komatireddy Rajagopal Reddy : తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఎన్నికలకు ఇంకా నెల 10 రోజుల సమయమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. తెలంగాణలో ప్రధాన పోటీ అంటే అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఈ మూడు పార్టీలదే ఇక్కడ పోటీ. ఈ మూడు పార్టీలు ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలవాలన్న కసిలో ఉన్నాయి. ఇక.. అధికార బీఆర్ఎస్ పార్టీ తనకున్న అధికారంతో ఎన్నికల సమరాన్ని ప్రారంభించింది. సీఎం కేసీఆర్ అయితే.. ఇప్పటికే పలు జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో అసంతృప్తితో ఉన్న నేతలకు గాలాలు వేస్తోంది. వాళ్లను పార్టీలో చేర్చుకొని పార్టీని బలంగా మార్చుకుంటోంది.

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ హవా నడుస్తుంటే.. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల విషయంలో భయపడుతోంది. బీజేపీ పరిస్థితి అయితే ఇంకా దారుణం. ఎందుకంటే.. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తొలి విడతలో 55 మంది అభ్యర్థులను ప్రకటించింది. కానీ.. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. ఇవాళ, రేపు అంటూ బీజేపీ తాత్సారం చేస్తోంది. అది బీజేపీకి ఖచ్చితంగా పెద్ద మైనస్ అయ్యే చాన్స్ ఉంది. ఇదంతా పక్కన పెడితే అసలు కొన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. బీజేపీలో కొన్ని నియోజకవర్గాల్లో చాలామంది పోటీలో ఉన్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేకపోవడంతో ఏం చేయాలో బీజేపీ హైకమాండ్ కు అర్థం కావడం లేదు.

komatireddy rajagopal reddy big twist before bjp mla candidates first list

Komatireddy Rajagopal Reddy : కోమటిరెడ్డి, విజయశాంతి ఎక్కడ పోటీ చేస్తారు?

ఇదంతా పక్కన పెడితే అసలు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో క్లారిటీ రావడం లేదు. అసలు ఆయన బీజేపీని వీడి మళ్లీ కాంగ్రెస్ లో చేరుతారని ఓవైపు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన బీజేపీలో ఉంటారు కానీ.. ఆయనకు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయాలని ఉందని తెలుస్తోంది. నిజానికి ఆయనది మునుగోడు నియోజకవర్గం. కానీ.. మునుగోడు నుంచి కాకుండా.. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈటల రాజేందర్.. హుజురాబాద్ తో పాటు గజ్వేల్ లోనూ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. విజయశాంతి.. కామారెడ్డి నుంచి అనుకుంటున్నారు. ఇటీవల కోమటిరెడ్డి.. మునుగోడు, ఎల్బీ నగర్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. అలా కాకుండా.. ఆయన భార్యను మునుగోడు నుంచి బరిలోకి దింపాలని అనుకుంటున్నారట. ఏది ఏమైనా.. కోమటిరెడ్డి నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక కిషన్ రెడ్డి.. లిస్టు తయారీ విషయంలో ఇంకాస్త లేటు చేస్తున్నట్టు తెలుస్తోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది