Konda Vishweshwar Reddy : కాంగ్రెస్‌లోకి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చేశాడు?
Konda Vishweshwar Reddy : హమ్మయ్య.. ఒక పని అయితే అయిపోయింది. నవంబర్ 10 తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో మునిగారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ మినహా.. కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానం చివరి నిమిషంలో కొందరు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్ల కోసం చివరి నిమిషంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు హడావుడి చేశారు. ఏది ఏమైనా ఇవాళ్టితో […]
ప్రధానాంశాలు:
కొండా కోరిన వాళ్లకే బీజేపీ హైకమాండ్ టికెట్స్ ఇచ్చిందా?
కొండా పార్టీ మారుతున్నారా లేదా?
కొండా వైపే అధిష్ఠానం మొగ్గు చూపిందా?
Konda Vishweshwar Reddy : హమ్మయ్య.. ఒక పని అయితే అయిపోయింది. నవంబర్ 10 తో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో మునిగారు. ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. అయితే.. బీఆర్ఎస్ మినహా.. కాంగ్రెస్, బీజేపీ అధిష్ఠానం చివరి నిమిషంలో కొందరు అభ్యర్థులను ప్రకటించడంతో నామినేషన్ల కోసం చివరి నిమిషంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు హడావుడి చేశారు. ఏది ఏమైనా ఇవాళ్టితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మరోవైపు ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉంది. చివరి నిమిషంలో బీజేపీ ప్రకటించిన జాబితాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. చివరి క్షణంలో చాలామంది అభ్యర్థులను మార్చింది బీజేపీ హైకమాండ్.
ఇక.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకు నచ్చిన వాళ్లకే టికెట్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ వద్ద పట్టుబట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ తన వాళ్లకు కాకుండా వేరే వాళ్లకు ఇస్తే పార్టీ మారడానికి కూడా తాను వెనుకాడనని బీజేపీకి అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి కొండా పార్టీ మారుతున్నారు అనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డికి కేటాయించింది. శేరిలింగంపల్లి స్థానం నుంచి కూడా తను చెప్పిన రవి కుమార్ యాదవ్ కే ఇచ్చారు.
Konda Vishweshwar Reddy : ముందు జనసేనకు కేటాయించాలని అనుకున్నారు?
అయితే.. శేరిలింగంపల్లి స్థానాన్ని ముందు జనసేన పార్టీకి కేటాయించాలని బీజేపీ హైకమాండ్ భావించింది. కానీ.. జనసేనకు ఇవ్వొద్దని పట్టుబట్టారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగి తను చెప్పిన వారికే శేరిలింగంపల్లి టికెట్ ఇవ్వాలని లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి వస్తుందని ఆయన పార్టీ హైకమాండ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా చివరకు కొండా తన పంతాన్ని నెగ్గించుకొని తను కోరుకున్న వాళ్లకే టికెట్లు ఇప్పించడంలో సఫలం అయ్యారు. అంటే ఇక కొండా ఇప్పట్లో బీజేపీ పార్టీని వీడే అవకాశం అయితే లేనట్టుగానే తెలుస్తోంది.