lagadapati rajagopal : లగడపాటి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడా ..? జగనే టార్గెట్
lagadapati rajagopal : తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ముందస్తు ఎన్నికల ఫలితాలు వెల్లడించటంలో లగడపాటికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదే విధంగా తెలంగాణ విషయంలో కూడా లగడపాటి చేసిన పనికి అప్పట్లో తెలంగాణ ప్రజలందరికి లగడపాటి ఒక విలన్ గా మారిపోయాడు. అదే సమయంలో తెలంగాణ ఏర్పడితే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పిన ఆయన, ఆ మాట మేరకు అప్పటినుండి ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.
రాజకీయంగా దూరంగా ఉంటున్న కానీ ఆయన మనస్సు మాత్రం రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. దీనితో తన కొడుకు ఆశ్రితను రంగంలోకి దించాలని చూస్తున్నాడు. ఇందుకు సరైన పార్టీ కోసం చూస్తున్నాడు. నిజానికి పచ్చి కాంగ్రెస్ వాది అయిన లగడపాటి ఆంధ్రాలో కాంగ్రెస్ భూస్థాపితం కావటంతో తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యాడని తెలుసు, ప్రత్యేకంగా పార్టీలో చేరకపోయిన కానీ, పరోక్షంగా టీడీపీ కి మద్దతు ఇస్తూ వచ్చాడు.. అప్పట్లో తెలంగాణ లో మహా కూటమి విజయం సాధిస్తుందని చెప్పిన కానీ, ఆ తర్వాత మొన్నటి 2019 ఎన్నికల సమయంలో ఆంధ్రాలో టీడీపీ విజయం సాధిస్తుందని చెప్పిన కానీ ఎదో ఒక రకంగా టీడీపీ కి మేలు చేయాలనే ఉద్దేశ్యం ఆయన్లో కనిపించింది.
అయితే కొడుకు రాజకీయ భవిష్యత్తు విషయానికి వచ్చేసారికి లగడపాటికి టీడీపీ పార్టీ విషయంలో అంత సానుకూలంగా అనిపించినట్లు లేదు. అందుకే తన కొడుకును వైసీపీ కి దగ్గర చేసి, మెల్లగా జగన్ బ్యాచ్ లోకి పంపించాలనే ఆలోచనతో ఉన్నట్లు విజయవాడ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. తనకున్న పరిచయాలు ఉపయోగించి లాబీయింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది.
విజయవాడ ఎంపీ స్థానానికి సరైన అభ్యర్థి కోసం వైసీపీ గత కొద్దీ రోజులుగా వెతుకులాట కొనసాగిస్తుంది. లగడపాటి ఆలోచన కూడా ఇదే సీటు మీద ఉంది . తెలంగాణ తెరాస నేత దానం నాగేందర్ తో వియ్యం అందుకున్న లగడపాటి సాధ్యమైనంత వరకు అటు తెరాస వర్గాల నుండి కూడా వైసీపీ పెద్దలతో లాబీయింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటిదాకా చేతిలో అధికారం లేకపోయిన కానీ ఎలాగోలా అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణ లో తన వ్యాపారాలకు ఇబ్బందులు రాకుండా చూసుకున్న లగడపాటి, ఇకపై చేతిలో అధికారం లేకపోతే రాబోయే రోజుల్లో కష్టమని భావించి కొడుకుకు దించటానికి సిద్ధం అయ్యాడని రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట