Nara Lokesh : ఈసారి మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయం… సంచలన సర్వే ఫలితాలు విడుదల..!!
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ TDP అధినేత చంద్రబాబు Chandrababu కుమారుడు నారా లోకేష్ 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి మంగళగిరి Mangalagiri లో పోటీ చేసి ఓడిపోవడం తెలిసిందే. లోకేష్ ఓటమి తెలుగుదేశం పార్టీకి భారీ డ్యామేజ్ తీసుకురావడం జరిగింది. అంతకుముందు 2014 ఎన్నికలలో పోటీ చేయని లోకేష్ ఎమ్మెల్సీగా వచ్చి కేడర్లో మంత్రి పదవి అందుకున్నారు. అయితే ఫస్ట్ టైం ప్రజాక్షేత్రంలో పోటీ చేసిన లోకేష్ ఓటమి పాలు కావడం జరిగింది. లోకేష్ ఓటమిపై ప్రత్యర్థులు ఇప్పటికీ కూడా… సెటైర్ లు వేస్తూ ఉంటారు. అయితే ఆంధ్రాలో మరికొద్ది నెలలో ఎన్నికలు జరగనున్న క్రమంలో పొలిటికల్ క్రిటిక్స్ సంస్థ మంగళగిరిలో సర్వే చేయడం జరిగింది.
ఈ క్రమంలో మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ గెలవబోతున్నట్లు.. సర్వేలో ఫలితాలు వెలువడ్డాయి. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. అమరావతి రాజధాని అంశం కావటంతో పాటు ప్రతి గ్రామంలో పర్యటనలు చేసి అక్కడ నియోజకవర్గ ప్రజలకు పెళ్లి కానుక ఇంకా ఆరోగ్య సేవలు వంటి ద్వారా ఓటర్లకు ఇటీవల లోకేష్ బాగా దగ్గరయ్యారు. యువగళం పాదయాత్రలో కూడా కూడా ప్రతి ఇంటింటికి తిరుగుతూ లోకేష్ మంగళగిరి ప్రజల సమస్యలను చాలా ఓపిక విన్నారు. పాదయాత్ర ద్వారా మరింత దగ్గరయ్యారు.
ఈసారి లోకేష్ స్వల్ప మెజారిటీతో గెలవబోతున్నట్లు ఈ సర్వే ఫలితాలలో లెక్కలు బయటపడ్డాయి. మంగళగిరిలో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 44.15 శాతం, టీడీపీకీ 44.99% ఓట్లు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేయడం జరిగింది. ఎన్డీఏకు 04.85%, సీపీఐ 03.17% ఓట్లు తగ్గ అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఫలితాలతో మంగళగిరి టిడిపి క్యాడర్ ఫుల్ ఆనందంగా ఉంది.