Monalisa : పూసలమ్మే మోనాలిసా అందంగా ఉండడం తప్పా.. ఎంతలా వేధించారంటే..!
ప్రధానాంశాలు:
Monalisa : పూసలమ్మే మోనాలిసా అందంగా ఉండడం తప్పా.. ఎంతలా వేధించారంటే..!
Monalisa : ఇండోర్ కు చెందిన ఓ మహిళ పూసల దండలు అమ్ముతున్న మోనాలిసా అనే యవతి కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోల్లో ఆమె కళ్లు.. హెయిర్ స్టైల్ జనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి అనుకోకుండా ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. మహా కుంభమేళాలో తన మాలను అమ్ముతూ రోజుకు 2వేల నుండి 3 వేలు సంపాదిస్తున్నట్లు ఆమె తెలిపింది.
Monalisa మరీ అంత టార్చరా..
ఫిబ్రవరి ముగిసేలోగా లక్షన్నరకు పైగా సంపాదించాలనే తన ఆశను కూడా ఆమె వెల్లడించింది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.. మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు.
మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం.. ఆ తర్వాత ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు, అక్కడికి వచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమెకి చిరాకెత్తింది.చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే.. మోనాలిసా వెంటే వెళ్లి మైక్‌లు, కెమెరాలు, ఫోన్లు పెడుతుండటంతో ఆమె వారిని నెట్టేసింది