Monalisa : కామాంధుడి నుండి బయటపడ్డ మోనాలిసా..!
ప్రధానాంశాలు:
Monalisa : కామాంధుడి నుండి బయటపడ్డ మోనాలిసా..!
Monalisa : ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో పూసలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా అనుకోకుండా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె అందమైన కళ్లతో, ప్రత్యేకమైన రూపంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సామాన్యురాలిగా కనిపించిన ఈ యువతి, ఒక్కసారిగా రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను తన తాజా ప్రాజెక్ట్ ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ లో హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. అంతేకాకుండా ఆమెకు జ్యువెలరీ షాప్ ఓపెనింగ్‌లు, ప్రకటనల ప్రపంచంలో అవకాశాలు కూడా రావడం మొదలైంది.

Monalisa : కామాంధుడి నుండి బయటపడ్డ మోనాలిసా..!
Monalisa పెద్ద గండం నుండి బయటపడ్డ మోనాలిసా
అయితే సనోజ్ మిశ్రా గతం నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గానే ఉన్నాడు. అతను కొత్త అమ్మాయిలను సినిమా అవకాశాల పేరుతో మోసగించి, వారి జీవితాలతో ఆడుకుంటాడనే ఆరోపణలు ఇప్పటికే వినిపించేవి. అతను దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా విడుదల కాలేదని, దర్శకుడంటూ అమ్మాయిలను తప్పుదారి పట్టించడమే అతని అసలు లక్ష్యమని కొందరు పేర్కొన్నారు. ఇదే క్రమంలో అతనిపై తాజాగా అత్యాచారం కేసు నమోదైంది. సినిమాల్లో అవకాశం ఇస్తానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి అనంతరం మోసం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరిపి, ఫిబ్రవరిలో సనోజ్ మిశ్రాను అరెస్ట్ చేశారు. బాధితురాలిని బెదిరించి, ఆమెపై ఒత్తిడి తేవడమే కాకుండా ప్రైవేట్ వీడియోలు లీక్ చేస్తానని బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో అతని అరెస్టు ఖాయమైంది. ఈ వివాదంలో మోనాలిసా ఎలాంటి సమస్యలో పడకుండా తప్పించుకుంది. కానీ ఈ పరిణామాల వల్ల ఆమె సినీ ఇండస్ట్రీలో కొనసాగుతుందా లేదా అనే ప్రశ్న మెదులుతోంది. బాలీవుడ్ అవకాశాలతో ముందుకు వెళ్లేనా? లేక ఈ వివాదాల ప్రభావంతో వెనక్కి తగ్గిపోతుందా? అనే అంశం అందరిలో ఆసక్తిని రేపుతోంది.