Revanth Reddy : 10 కోట్లు, 5 ఎకరాల భూమికి ఆ నియోజకవర్గ టికెట్‌ను అమ్ముకున్న రేవంత్ రెడ్డి? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Revanth Reddy : 10 కోట్లు, 5 ఎకరాల భూమికి ఆ నియోజకవర్గ టికెట్‌ను అమ్ముకున్న రేవంత్ రెడ్డి?

Revanth Reddy : టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును 10 కోట్ల రూపాయలు, 5 ఎకరాల భూమి.. ఈ రెండు ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టికెట్ కన్ఫమ్ అయినట్టే. నేరుగా రేవంత్ రెడ్డి నుంచే ఈ హామీ లభిస్తోంది. తాజాగా 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకొని మహేశ్వరం టికెట్ ‌ను బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డికి రేవంత్ రెడ్డి ఇచ్చేశారట. ఇది మేము చెబుతున్నది కాదు.. కాంగ్రెస్ నేత […]

 Authored By kranthi | The Telugu News | Updated on :27 September 2023,3:00 pm

Revanth Reddy : టైటిల్ చూసి షాక్ అయ్యారా? అవును 10 కోట్ల రూపాయలు, 5 ఎకరాల భూమి.. ఈ రెండు ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టికెట్ కన్ఫమ్ అయినట్టే. నేరుగా రేవంత్ రెడ్డి నుంచే ఈ హామీ లభిస్తోంది. తాజాగా 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకొని మహేశ్వరం టికెట్ ‌ను బడంగ్ పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహరెడ్డికి రేవంత్ రెడ్డి ఇచ్చేశారట. ఇది మేము చెబుతున్నది కాదు.. కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.

manohar reddy alleges revanth reddy selling congress party tickets

#image_title

సమయం వచ్చినప్పుడు అన్ని సాక్ష్యాలతో సహా బయట పెడతా అని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సీనియర్ నేత వీ హనుమంత రావుకు కూడా ఈ విషయం తెలుసని.. అవసరం వచ్చినప్పుడు అన్ని ఆధారాలతో సహా బయటపెడతా అని మనోహర్ రెడ్డి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లను రేవంత్ రెడ్డి అమ్ముకుంటున్నారని.. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కూడా 10 కోట్లు, 5 ఎకరాల భూమి రాయించుకొని మరీ పారిజాత నర్సింహరెడ్డికి ఇచ్చేశారని ఆయన మండిపడ్డారు.

Revanth Reddy : వీ హనమంతారావు కూడా అదే అన్నారు

మొన్న డిల్లీకి పోయిన. అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు కనిపించారు. మీ దగ్గర ఓ మనిషి అట 5 ఎకరాల పొలం రిజిస్ట్రేషన్ చేయించుకున్నడట అని చెప్పిండు. దీంతో అదేం లేదు అన్న అని నేను అన్న. ఇంకొకరు 10 కోట్లు ఇచ్చినం అని చెప్పారు. రేవంత్ రెడ్డికి 10 కోట్లు ఇచ్చిన అని చెప్పిన వాళ్లు కూడా ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు అన్నీ బయటికి తీస్తా అని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది