YS Jagan : జగన్ బంపర్ ఆఫర్.. గ్రామ సచివాలయంలోనే అవి పొందచ్చు
YS Jagan : ఎక్కడైనా సరే.. పెళ్లి చేసుకునే వాళ్లకు ఆధారం వివాహ ధృవీకరణ సర్టిఫికెట్ ( marriage certificate ). దాన్నే మ్యారేజ్ సర్టిఫికెట్ అని కూడా అంటారు. ఈ సర్టిఫికెట్ ను మామూలుగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లి అయిన తర్వాత తగిన ప్రూఫ్స్ తీసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్తే అక్కడ ఈ సర్టిఫికెట్ ఇస్తారు. కానీ.. ఇక నుంచి ఏపీలో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు.
దాని కోసం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. గ్రామ వార్డు సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ ను జారీ చేసేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీని గురించి సీఎం జగన్ స్వయంగా చెప్పారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం గురించి ప్రజలకు చెప్పిన వైఎస్ జగన్.. ఈ పథకం ద్వారా త్వరలోనే పెళ్లి చేసుకున్న ఎస్సీలకు రూ.లక్ష ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే.. మ్యారేజ్ సర్టిఫికెట్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు.
YS Jagan : సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వరా?
ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి ఆ సర్టిఫికెట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తమ సొంత గ్రామంలోనే గ్రామ వార్డు సచివాలయాల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్ పొందొచ్చు.. అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరోవైపు వైఎస్సార్ కళ్యాణమస్తు పథకం ప్రకారం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్లకు లక్షా 20 వేలు, బీసీలకు 50 వేలు, బీసీల్లో కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు రూ.75 వేలు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం కింద మైనారిటీలకు రూ.లక్ష ఇవ్వనున్నారు. అలాగే.. ప్రతిభావంతులకు రూ. లక్షా 50 వేలు, భవన, నిర్మాణ కార్మికులకు 40 వేలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.