Lok Sabha Election : లోక్ సభ ఎన్నికలకు మైండ్ గేమ్ పాలిటిక్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lok Sabha Election : లోక్ సభ ఎన్నికలకు మైండ్ గేమ్ పాలిటిక్స్..!

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Lok Sabha Election : లోక్ సభ ఎన్నికలకు మైండ్ గేమ్ పాలిటిక్స్..!

lok sabha Election : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మైండ్ గేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎవరికివారు ఎదుటివారి పని అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ మరో ఆరు నెలలే ఉంటుందని బీఆర్ఎస్, బీజేపీ అంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ లేనట్లే అని కాంగ్రెస్ అంటుంది. ఈ మూడు పార్టీల రాజకీయం అనాశక్తిగా మారుతుంది. తెలంగాణ మూడు ప్రధాన పార్టీలకు లోకసభ ఎన్నికలు చాలా ప్రధానమైనవి. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకుని పోయిన ప్రతిష్టను తిరిగి పొందాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగా కేసీఆర్ కూడా పార్లమెంటుకు పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతోపాటు కేటీఆర్, హరీష్ రావు కూడా లోక్ సభ బరిలోకి దిగుతారని తెలుస్తుంది.

లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే క్యాడర్లో నిరుత్సాహంతో పాటు కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళతారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి పార్టీ ఇచ్చిన హామీలను పట్టాలెక్కిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు రేవంత్ కి కాంగ్రెస్ కి చాలా కీలకం. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించకపోతే పార్టీలో అసమర్థులు అలజడులు ఉండవచ్చు అని భావించిన రేవంత్ రెడ్డి సోనియాగాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. దీనికి సోనియాగాంధీ కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే కాంగ్రెస్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. క్యాడర్లోను కార్యకర్తలను నూతన ఉత్సాహం వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి అది కొద్ది రోజుల్లోనే కోల్పోతుందని హెచ్చరికలు వస్తున్నాయి.

ఇక బీజేపీ కూడా లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టానంగా తీసుకునే అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తప్పించి ఘోరతప్పిదం చేసిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో స్వయంకృత అపరాదాలకు చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది. గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి మల్కాజిగిరి, ముషీరాబాద్ స్థానాలపై కూడా దృష్టి పెట్టింది. రానున్న లోక్ సభ ఎన్నికలకు రాజస్థాన్ సీనియర్ నేత చంద్రశేఖర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది. కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని, ఏ క్షణంలోనైనా కేసీఆర్ కాంగ్రెస్ ని కూలుస్తారని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇలా ఒకరిపై మరొకరు చేసుకుంటూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది