#image_title
Mohan Babu : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని కొందరంటే.. సక్రమమే అని మరికొందరు అంటున్నారు. టీడీపీ నేతలు, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు అయితే బేషరతుగా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఇప్పటి వరకు పెద్దగా ఎవ్వరూ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు. నందమూరి కుటుంబ సభ్యుడు అయిన జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందించలేదు కానీ.. మోహన్ బాబు మాత్రం చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు, బాలయ్య ఇద్దరూ కలిసి మోసం చేశారంటూ చెప్పుకొచ్చారు.
చంద్రబాబుతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని.. చంద్రబాబు గురించి తనకే ఎక్కువగా తెలుసని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు దిట్ట అని.. పుట్టుకతోనే చంద్రబాబు అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. అసలు టీడీపీ పార్టీ ఎవరిది.. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది. సినిమా రంగాన్ని వదిలేసి మరీ.. రాజకీయాల్లో వచ్చి టీడీపీని స్థాపించి ఒక చరిత్ర సృష్టించారు. భారతదేశంలోనే టీడీపీకి ఎంతో గౌరవం తీసుకొచ్చారు. ఆ మహానుభావుడు ఈయనకు కన్యాదానం చేస్తే పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబునాయుడు.
#image_title
చంద్రబాబు ఎవ్వరినైనా కరివేపాకులా తీసేస్తారని.. తనకు అవసరం ఉన్నంత సేపే ఎవ్వరినైనా వాడుకుంటారని.. ఆ తర్వాత ఎవ్వరైనా సరే కరివేపాకులా కూరలో నుంచి తీసిపారేస్తారని చెప్పుకొచ్చారు. వైస్రాయ్ హోటల్ కి ఎన్టీఆర్ వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలతో మాట్లాడనీయకుండా టపటప ఆయన మీద చెప్పులు విసిరిన ఘనత చంద్రబాబుది. ఊసరవెల్లిలా మాటలు చెబుతాడు. అస్సలు చంద్రబాబును నమ్మొద్దు. నమ్మితే అడ్డంగా మోసపోవడం ఖాయం. అలా చాలామందిని చంద్రబాబు మోసం చేశారని.. జూనియర్ ఎన్టీఆర్ ను కూడా వాడుకొని వదిలేశారని.. ఎవరికి జనాల్లో బలం ఉంటే వాళ్లను వాడుకొని వదిలేస్తారని, ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారని మోహన్ బాబు స్పష్టం చేశారు.
Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ ప్రాంతంలోని T.Nagar కాలనీ రోడ్డు నెం:-3లో సుమారు 11.00…
Mahesh Kumar Goud : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్కుమార్గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే…
Lady Aghori : అఘోరి వర్షిణికి సంచలన హెచ్చరిక చేసారు. ఇకనైనా మమ్మల్ని వదిలేయండి.. లేకపోతే సచ్చిపోతాం అంటూ వారు…
Divi Vadthya : బిగ్బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో దివి వైద్య ఒకరు. హైదరాబాద్కు చెందిన…
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి.…
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
This website uses cookies.