Nagarjuna : ఒక్క అంగుళం క‌బ్బా చేసిన‌ట్టు తేలితే నేనే కూల్చేస్తా.. నాగార్జున‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nagarjuna : ఒక్క అంగుళం క‌బ్బా చేసిన‌ట్టు తేలితే నేనే కూల్చేస్తా.. నాగార్జున‌

Nagarjuna : హైదరాబాద్‌ లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ) కొర‌డా ఝుళిపిస్తున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేసారు హైడ్రా అధికారులు .తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Nagarjuna : ఒక్క అంగుళం క‌బ్బా చేసిన‌ట్టు తేలితే నేనే కూల్చేస్తా.. నాగార్జున‌

Nagarjuna : హైదరాబాద్‌ లో గత కొన్నిరోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ) కొర‌డా ఝుళిపిస్తున్న విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేసారు హైడ్రా అధికారులు .తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించారని ఫిర్యాదు వచ్చింది. దీంతో విచారణ నిర్వహించిన అధికారులు అది ఆక్రమిత స్థలంగా తేల్చుకుని పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉండ‌డంతో దానిని కూల్చి వేసారు.

Nagarjuna ఇది క‌రెక్ట్ కాదు..

భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. కాగా.. N కన్వేషన్‌ కూల్చివేతపై సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్‌-కన్వెన్షన్ కూల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. ఎన్‌-కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని.. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని నాగార్జున పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారన్నారు. ఎలాంటి నోటీసులివ్వకుండా కూల్చడం సరికాదన్నారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే నేనే కూల్చేవాడినంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టంచేశారు.

Nagarjuna ఒక్క అంగుళం క‌బ్బా చేసిన‌ట్టు తేలితే నేనే కూల్చేస్తా నాగార్జున‌

Nagarjuna : ఒక్క అంగుళం క‌బ్బా చేసిన‌ట్టు తేలితే నేనే కూల్చేస్తా.. నాగార్జున‌

కేసు కోర్టులో ఉన్న‌ప్పుడు ఇలా చేయ‌డం స‌రికాద‌ని పేర్కొన్నారు. ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది