Nara Lokesh : ముందు జైలులో వేయండి.. నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్

Advertisement

Nara Lokesh : నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ టీడీపీలో కీలక నేత. అలాగే.. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు. అందుకే ఆయనకు అంత ప్రాముఖ్యత. లోకేష్ ప్రస్తుతం యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే టీడీపీ అధినేత చంద్రబాబును త్వరలోనే అరెస్ట్ చేస్తారు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నన్ను రేపో, ఎల్లుండో అరెస్ట్ చేసినా చేస్తారు అంటూ చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

అసలు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేస్తారు.. ఎవరు అరెస్ట్ చేస్తారు. నిజంగానే తన హయాంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారా? అంటే అవుననే చెప్పుకోవాలి. ఒక్కటి కాదు.. రెండు కాదు చాలా కుంభకోణాలు తాజాగా వెలుగులోకి చూస్తున్నాయి. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు. తన కొడుకు నారా లోకేష్ కూడా ఈ కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. అమరావతి భూముల కుంభకోణం కావచ్చు. ఇంకేదో కావచ్చు. వాటిపై పక్కాగా ఆధారాలు చూపించి మరీ సిట్ అధికారులు చంద్రబాబును, ఆయన కొడుకునే కాదు.. పలువురు టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేయనున్నారట.త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఏపీలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అవినీతి పరుడు అని నిరూపించి ఆయన్ను అరెస్ట్ చేస్తే టీడీపీ పాతాళంలో కొట్టుకుపోతుంది అన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ పని చేయిస్తోందా?

Advertisement
Nara Lokesh About on Chandrababu Notices
Nara Lokesh About on Chandrababu Notices

Nara Lokesh : అందుకే చంద్రబాబుకు ఐటీ నోటీసులు పంపించారా?

లేక ఎవరు చేయిస్తున్నారు అనేది పక్కన పెడితే అసలు నిజంగానే చంద్రబాబు హయాంలో భారీగానే అవినీతి జరిగినట్టు మాత్రం తెలుస్తోంది. అందుకే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. సిట్ అధికారులు కూడా రంగంలోకి దిగారు. చంద్రబాబును ఇక రేపో ఎల్లుండో అరెస్ట్ చేయబోతున్నారు అనేది మాత్రం వాస్తవమే. కానీ.. దీనిపై నారా లోకేష్ కానీ.. టీడీపీ నేతలు కానీ స్పందించడం లేదు.

Advertisement
Advertisement