Nara Lokesh : మీటింగ్ మధ్యలో నారా లోకేష్ చేసిన పనికి పడీ పడీ నవ్విన జనం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : మీటింగ్ మధ్యలో నారా లోకేష్ చేసిన పనికి పడీ పడీ నవ్విన జనం !

 Authored By kranthi | The Telugu News | Updated on :30 June 2023,11:00 am

Nara Lokesh : నారా లోకేష్ అనగానే మనకు గుర్తొచ్చేది పప్పు. అవును.. నారా లోకేష్ ను అందరూ పప్పు అంటుంటారు. లోకేష్ ను పప్పు అనడానికి కారణం.. మైకు ముందు ఆయన చేసే చేష్టలు. అవును.. ఒక్కోసారి ఆయన మైకు ముందు ఏం మాట్లాడుతారో ఎవ్వరికీ అర్థం కాదు. అలా చాలాసార్లు వచ్చీ రాని భాషతో నవ్వుల పాలు అయ్యారు. తను మాట్లాడుతుంటే విని నవ్వని వాళ్లు ఉండరు. అది కామన్ అయిపోయింది. సోషల్ మీడియాలో పప్పు అంటూ లోకేష్ ను ట్రోలింగ్ చేయడం కొత్తేమీ కాదు.

తాజాగా ఆయన నెల్లూరు జిల్లా యువగళం పాదయాత్రలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ గతాన్ని గుర్తు చేశాయి. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ మాట్లాడుతున్నారు. చేతుల్లో పేపర్ పెట్టుకున్నారు కానీ.. చాలా కన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన తర్వాత రైతుల గురించి ఏదో చెబుతున్నారు. ఏకంగా అంటూ మొదలు పెట్టారు. కానీ.. మధ్యలో ఏమైందో ఆగిపోయారు.ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నిలబడుతోంది. ఏకంగా రైతుల గాయాల పైన.. అంటూ ఆగిపోయారు. ఏకంగా రైతుల గాయాలపైన అంటూ మూడు నాలుగు సార్లు పలికినా అది రావడం లేదు. దీంతో నారా లోకేష్ సభకు వచ్చిన వాళ్లంతా లోకేష్ ఏం చెబుతారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

nara lokesh funny comments in his yuvagalam

nara lokesh funny comments in his yuvagalam

Nara Lokesh : మళ్లీ పేపర్ చదువుకొని ఆ వాక్యాన్ని పూర్తి చేసిన నారా లోకేష్

లోకేష్ పక్కన ఉన్న టీడీపీ నాయకులు మాత్రం అయ్యో చినబాబు ఏంటి ఇలా చేశారు అని అనుకున్నారు. ఇంతలో ఒక్క నిమిషం అని చెప్పి పేపర్ ఓపెన్ చేసి నారా లోకేష్ ఆ పేపర్ ను చూసి రైతుల గాయాల పైన కారం చల్లుతున్నారు అంటూ ఆ వాక్యాన్ని పూర్తి చేశారు నారా లోకేష్. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది