Pawan Kalyan : వైఎస్ జ‌గ‌న్ గాయం గురించి ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జ‌రుగుతుంది..? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pawan Kalyan : వైఎస్ జ‌గ‌న్ గాయం గురించి ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జ‌రుగుతుంది..?

Pawan Kalyan : ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ప్రజలను నేరుగా కలుస్తున్నారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు దగ్గరగా వెళుతున్నారు.అయితే విజ‌య‌వాడ‌లో ఆయ‌న‌పై రాయితో దాడి చేశారు. ఈ దాడి త‌ర్వాత చాలామంది నాయకులు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ సైతం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్ర‌బాబు కూడా సానుభూతి […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 April 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Pawan Kalyan : వైఎస్ జ‌గ‌న్ గాయం గురించి ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జ‌రుగుతుంది..?

Pawan Kalyan : ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ప్రజలను నేరుగా కలుస్తున్నారు. పలు చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజలకు దగ్గరగా వెళుతున్నారు.అయితే విజ‌య‌వాడ‌లో ఆయ‌న‌పై రాయితో దాడి చేశారు. ఈ దాడి త‌ర్వాత చాలామంది నాయకులు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ సైతం జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్ర‌బాబు కూడా సానుభూతి తెలియ‌జేశారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయ‌లేదు. అయితే తాజాగా తెనాలి మీటింగ్‌లో మాత్రం జ‌గ‌న్ దాడి గురించి ప్ర‌స్తావిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Pawan Kalyan : వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం

సీఎం జగన్ కి గాయమైతే.. రాష్ట్రానికే గాయమైనట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుడ్ని చంపేసినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 వేలమంది ఆడబిడ్డలు అదృశ్యమైతే అప్పుడు గాయం కాలేదా అని మండిప‌డ్డారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు రాష్ట్రానికి గాయం కాలేదా అని ప్రశ్నించారు పవన్. జగన్ చుట్టూ భద్రత ఉందని, ఆపై జెండాలున్నాయని, అంత భద్రత ఉన్న సీఎంపై రాయి వేయడమా..? అని లాజిక్ కూడా మాట్లాడారు ప‌వ‌న్. రాష్ట్ర డీజీపీ, నిఘా విభాగం దాడులు జ‌రుగుతుంటే ఏం చేస్తున్నట్లు అని అడిగారు. ‘నాన్నా పులి వచ్చే.. కథలా ఎన్నిసార్లు నమ్మాలి? నమ్మకం పోయింది. ఈ డ్రామాలు ఆపాలి’ అంటూ సెటైర్లు వేశారు పవన్.

Pawan Kalyan వైఎస్ జ‌గ‌న్ గాయం గురించి ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రాళ్ల దాడితో ఏపీలో ఏం జ‌రుగుతుంది

Pawan Kalyan : వైఎస్ జ‌గ‌న్ గాయం గురించి ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. రాళ్ల దాడితో ఏపీలో ఏం జ‌రుగుతుంది..?

ముఖ్యమంత్రిపై దాడి జరిగితే కనీసం సానుభూతి చూపకుండా ఇలా వెటకారంగా మాట్లాడటం హాట్ టాపిక్ అవుతుంది. అయితే జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన కొద్ది గంట‌ల‌లోనే చంద్ర‌బాబు, ప‌వ‌న్‌పై కూడా దాడి చేసే ప్ర‌య‌త్నం చేశారు.. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తెనాలిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాసి విసిరాడు. అయితే, అది పక్కన పడింది.విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబుపైకి రాయి విసిరి అక్కడ్నుంచి పరారయ్యాడు. అయితే, చంద్రబాబుకు తగలకుండా పక్కకుపడింది. అస‌లు ఈ రాళ్ల దాడి వ‌ల‌న ఎలాంటి మెసేజ్ వెళుతుంది. సింప‌తీ కోసం ఇలా చేస్తున్నారా లేకుంటే ఇత‌ర కార‌ణాలు ఏమైన ఉన్నాయా అని రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది