Pawan kalyan : తనకి ఏ పదవి కావాలో నేషనల్ మీడియాతో చెప్పిన పవన్.. ఇది ఫిక్స్ అయినట్టేనా?
Pawan kalyan : ఏపీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్‌గా మారడం మనం చూశాం. టీడీపీ, బీజేపీలని కలిసి వైసీపీకి పెద్ద దెబ్బ కొట్టాడు. కూటమి ప్రభుత్వం మంచి విజయం సాధించేలా చేశాడు.పవన్ సాధించిన విజయంపై భాష, ప్రాంతం, ఎల్లలు లేకుండా కథనాలు, వీడియోల రూపంలో సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఈ పక్కన కూర్చున్న వ్యక్తి పవన్ కాదు.. తుఫాన్. ఏపీ రాజకీయాలను ఓ రేంజ్‌కు తీసుకెళ్లి.. ఎన్డీఏకు బలంగా మారాడు అని ప్రధాని మోదీ చెప్పడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. జాతీయ మీడియా పవన్ కల్యాణ్ గురించి ఉత్తరాది ప్రజలకు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నది.
Pawan kalyan పవన్‌కి ఏ పదవి ?
పవన్ కల్యాణ్ అంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో. లెజెండరీ యాక్టర్ చిరంజీవికి సోదరుడు.. అలాగే రాంచరణ్‌కు బాబాయ్ అంటూ పలు కథనాలు రాస్తున్నరు.అయితే కూటమిని భారీ మెజారిటీతో గెలిపించిన పవన్ కళ్యాణ్ ఏ పదవి దక్కించుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కాగా, ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఆ సమయంలో రిపోర్టర్ పవన్‌తో మాట్లాడారు.. ఆ రిపోర్టర్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కొద్దిసేపటికే ఆ ఛానల్ స్క్రోలింగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. పవన్ డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నట్లు వాళ్లు తెలియజేశారు.
ఈ నెల 12న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు చర్చ జరుగుతోంది. కొందరు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారని.. ప్రమాణ స్వీకారానికి తాము కూడా వెళతామని కొందరు జనసైనికులు జోరుగా చర్చించుకుంటున్నారు. జనసేనకు మూడు మంత్రి పదవులు కేటాయించినట్టు ప్రచారం నడుస్తుంది. మరికొందరు ఒక అడుగు ముందుకేసి.. ఆయనకు హోంశాఖ ఖాయమంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ కి ఏ పదవి దక్కనుంది అనేది రెండు రోజులలో తేలిపోతుంది.