Pawan Kalyan : ఒసేయ్ రోజా మా బాలయ్య ముందు నీ బతుకెంత.. రేయ్ జగన్ ఇక యుద్ధం మొదలైంది.. పవన్ మాస్ వార్నింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : ఒసేయ్ రోజా మా బాలయ్య ముందు నీ బతుకెంత.. రేయ్ జగన్ ఇక యుద్ధం మొదలైంది.. పవన్ మాస్ వార్నింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :2 October 2023,3:00 pm

Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ ను కూడా వైసీపీ నేతలు లాగుతున్నారు. దీంతో తాజాగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. డబ్బులు తీసుకుంటున్నారు అంటూ నన్ను అంటున్నారు. నాకు డబ్బు మీద మమకారం లేని ఎన్నిసార్లు చెప్పాలి. నువ్వు ప్యాకేజీలు తీసుకున్నావు అని మాట్లాడుతూ ఉంటే ఆ సన్నాసులను నేను ఏం చెప్పను. నాకు డబ్బులు అవసరం లేదు అని. నాకు అంత డబ్బుల మీదే వ్యామోహం ఉండి ఉంటే.. మాదాపూర్ 5 లక్షలో 10 లక్షలో ఎకరం. అలాంటివి నేను 10 ఎకరాలు కొని పెట్టుకొని ఉంటే.. కోట్లలో నాకు రెమ్యునరేషన్ ఉన్నప్పుడు ఈరోజు నాకు అదే 1000 కోట్ల ఆస్తి ఉండేది. నాకు నేల మీద, డబ్బు మీద మమకారం లేదు. మీరు బాగుండాలని చెప్పి ఆపేక్ష ఉంది. మీరు బాగుండాలని ఆశయం ఉంది కానీ.. నాకు నేల సమగ్రత పోకూడదు. నేను వీటి మీద దృష్టి పెట్టలేదు.

వైసీపీ సన్నాసులంతా మాట్లాడుతున్నారు. పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. ప్రతి దానికి ఇక్కడ చిన్న పాటి కాంట్రాక్టులకు కూడా 40 శాతం షేర్లు అడుగుతున్నారు. మీకు అవసరం కావచ్చు డబ్బు. నాకు అవసరం లేదు. డబ్బు మీద వ్యామోహం లేదు. డబ్బు తీసుకునే అలవాటు లేదు కాబట్టే 151 ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు ఉన్నా.. లక్షల కోట్లు ఉన్న జగన్ తోటి గొడవ పెట్టుకోవడానికి నా నైతిక బలమే వెన్నుముక అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. అలాంటి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఒక్కరు చేయగలిగింది కాదు రాజకీయం. చాలా క్లిష్టం అయిపోయింది. ఎన్టీఆర్ గారు వచ్చిన సమయంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఆరోజుల్లో ఇన్ని పార్టీలు లేవు, ఇంటర్నెట్ లేదు. సెల్ ఫోన్లు లేవు. ఒక్కటే పార్టీ కాంగ్రెస్ ఉండేది. దానికి ప్రత్యామ్నాయంగా ఆరోజు తెలుగు దేశం వచ్చింది. చాలామంది అధికారానికి దూరంగా ఉన్న బీసీ కులాల నుంచి అప్పటి దాకా రాజకీయ అనుభవం లేని చాలా కుటుంబాలు బయటికి వచ్చాయి. ఈరోజున ఎన్టీఆర్ కు కుదిరినట్టుగా అందరికీ కుదరదు.

pawan kalyan reacts over roja comments on balakrishna

#image_title

Pawan Kalyan : నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు

రెండు దశాబ్దాలు పనిచేస్తాం. కొద్ది మంది జీవితం అయినా సరే వెలుగు నింపితే అది చాలా అదృష్టం అనుకున్నాను. ఈ ప్రాసెస్ లో ఒకవేళ నాకు ఏదైనా ముఖ్యమంత్రి స్థానం వచ్చినా.. దానికి మించి స్థానం వచ్చినా కానీ.. స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే పదవి కోసం నేను వెంపర్లాడను. నేను వెంపర్లాడేది మీ భవిష్యత్తు కోసమే. ఆడబిడ్డల క్షేమం కోసమే నేను తపన పడతాను. ఆడబిడ్డలకు పది మందికి ఉపాధి కల్పించేలా ఎంట్రీప్రెన్యూర్స్ కావాలని నేను కోరుకుంటాను అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది