Perni Nani : వైసీపీ ఓటమికి కారణాలు ఎన్నో.. తల్లి చెల్లి కూడా.. పేర్ని నాని సంచలన కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Perni Nani : వైసీపీ ఓటమికి కారణాలు ఎన్నో.. తల్లి చెల్లి కూడా.. పేర్ని నాని సంచలన కామెంట్స్..!
Perni Nani : జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసిపి ఓటమి ఆ పార్టీ నేతలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలకు మంచి చేసినా సరే జగన్ ఓడించారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మాజీ మంత్రి పేర్ని నాని ఒక ఇంటర్వ్యూలో వైసీపీ ఓటమి గురించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజల వద్దకు వైసిపి పాలన వెళుతుందని అనుకున్నారే కానీ నేతలకు మధ్య దూరం పెరిగిందనే విషయాన్ని గుర్తించలేదని నాని అన్నారు.వైసిపి పాలనలో సీఎంఓ సరిగా పనిచేయలేదని విషయాన్ని వెల్లడించారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఉంటే ఫలితాలు వేరేగా వచ్చి ఉండొచ్చని చెప్పారు. ఇక వైసీపీలో కుటుంబ రాజకీయాలు ఎక్కువగా మారాయి అన్న విషయం ప్రస్తావించారు పేర్ని నాని. జగన్ తో పాటు అండగా ఉండాల్సిన వైయస్ విజయమ్మ, షర్మిల ఆయనకు దూరంగా ఉంటూ పార్టీ ఓటమికి కారణమయ్యారు.
Perni Nani నానితోపాటు కేతిరెడ్డి కూడా..
వైయస్ జగన్కు ఈ ఎలక్షన్లో తల్లి వైయస్ విజయమ్మ చెల్లి వైయస్ షర్మిల పెద్ద దెబ్బ వేశారని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని ప్రస్తావించారు పేర్ని నాని జగన్ పక్కనే విజయమ్మ ఉంటే పార్టీ కార్యకర్తలకు ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్లేదని చెప్పారు. ఇక షర్మిల కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించారు. వైయస్ ఫ్యామిలీ లో డిస్టబెన్స్ వల్లే పార్టీ ఓడిందన్న విషయాన్ని కేతిరెడ్డి కూడా బలపరిచారు. అయితే తన ఓటమి అంగీకరించిన కేతిరెడ్డి చంద్రబాబుపై ఎలాంటి అభియోగాలు చేయదలుచుకోలేదని అన్నారు.
గత ఎన్నికల్లో ధర్మవరం నుండి పోటీ చేసిన కేతిరెడ్డి ప్రజల్లో ఉంటూ ప్రజలతో తిరిగినా సరే ఓటమిపాలయ్యారు. వీళ్లిద్దరే కాదు దాదాపు పార్టీ నేతలు అంతా వైయస్ ఫ్యామిలీ లో ఉన్న ఈ ఇబ్బందుల వల్లే పార్టీ కార్యకర్తలు తమ వైపు నిలబడట్లేదని స్పష్టంగా అర్థం అవుతుందని అంటున్నారు. ఈసారి అధికారంలోకి రాకపోయినా వచ్చే ఎలక్షన్లలో తమ పార్టీ సత్తా చాటుతుందని వైసిపి నేతలంతా చాలా బలంగా చెబుతున్నారు.