Perni Nani : ఎమ్మెల్యే సీటు ఇస్తారో, ఇవ్వరో క్లారిటీ ఇచ్చిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని..!
Perni Nani : మరో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరుపక్ష పార్టీలు తమ ప్రచారంతో పోటీకి సిద్ధం అయ్యాయి. జనసేన, టీడీపీ కలిసి వైయస్సార్ సీపీ పార్టీపై వార్ ని ప్రకటించాయి. బీజేపీ కూడా జనసేన టీడీపీ తో కలిస్తే వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి ఓటమి ఖాయం అని అంటున్నారు. ఇక జైలు నుంచి వచ్చాక చంద్రబాబు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీపై చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. […]
ప్రధానాంశాలు:
Perni Nani : ఎమ్మెల్యే సీటు ఇస్తారో, ఇవ్వరో క్లారిటీ ఇచ్చిన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని..!
Perni Nani : మరో మూడు నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరుపక్ష పార్టీలు తమ ప్రచారంతో పోటీకి సిద్ధం అయ్యాయి. జనసేన, టీడీపీ కలిసి వైయస్సార్ సీపీ పార్టీపై వార్ ని ప్రకటించాయి. బీజేపీ కూడా జనసేన టీడీపీ తో కలిస్తే వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి ఓటమి ఖాయం అని అంటున్నారు. ఇక జైలు నుంచి వచ్చాక చంద్రబాబు ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీపై చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. వీటన్నిటికీ తగ్గట్టుగా వైయస్సార్ సీపీ నాయకులు కూడా వారిపై మండిపడుతున్నారు. తాజాగా మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబుపై ఫుల్ ఫైర్ అయ్యారు. అలాగే తనకు సీటు ఇస్తారో ఇవ్వరో అనేదానిపైన క్లారిటీ కూడా ఇచ్చారు.
పేర్ని నాని మాట్లాడుతూ.. తుఫాను వచ్చినప్పుడు కొల్లి రవీందర్ ఎక్కడికి వెళ్లి పోయాడు. ఈ తుఫాను కాదు ఏ తుఫాన్ కైనా అతను ఎక్కడైనా కనబడ్డాడా అని ప్రశ్నించారు. కరోనాలో అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. కరోనా టైంలో కొల్లి రవీందర్ ఎవరికైనా కనబడ్డాడా, కరోనాలో పేర్ని నాని, పేర్ని నాని కొడుకు ప్రాణాలకు తెగించి ఐసీయూలో పేర్ని కృష్ణమూర్తి అనే అతను 24 గంటల్లో 10 ,15 గంటలు ఆసుపత్రి వార్డుల్లో ఆయన తిరుగుతూ ఉండేవారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏది కావాలన్నా సొంత డబ్బులతో కూడా అరేంజ్ చేసాం. గవర్నమెంట్ నుంచి రావడం ఆలస్యం అయితే తుఫాన్ లో తుఫాను హెచ్చరికల మొదటి నుంచి చివరి వరకు పేర్ని కృష్ణమూర్తి జోరు వర్షంలో కూడా నడుము లోతు నీళ్లలో కూడా తిరుగుతూ ఉండేవారు.
భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారు. పేర్ని కృష్ణమూర్తి ప్రభుత్వం తరఫున తిరిగాడు. తుఫాన్ లో ఐదు రోజులు జనాలలో తిరిగాడు. జనం బాగోగులు పట్టించుకున్నాడు. ఇక సీటు వచ్చినా రాకపోయినా నష్టం ఏమీ లేదు. చంద్రబాబు లాగా సీటు కోసం వెంపర్లాడలేదు. సీటు కోసం కాదు పార్టీ కోసం పని చేస్తాం. సీటు వస్తే వస్తుంది లేకపోతే లేదు అంతే ఏముంది. జగన్ బాగుంటే చాలు అని కోరుకుంటాం. నేను నా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే చాలు అని కోరుకుంటాం. జగన్ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో పేదలు బావుంటారు. సీటు వచ్చినా రాకపోయినా జగన్ బాగుండాలి అని పేర్ని నాని తెలిపారు.