KCR – Perni Nani : కెసిఆర్ మీద పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు.. జన్మలో మిస్ అవ్వకూడని నాన్ స్టాప్ బ్యాటింగ్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR – Perni Nani : కెసిఆర్ మీద పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు.. జన్మలో మిస్ అవ్వకూడని నాన్ స్టాప్ బ్యాటింగ్ !

KCR – Perni Nani : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దానికి కారణాలు రెండు. ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ అంశం కాగా, మరొకటి ఏపీకి చెందిన కార్మికులను తెలంగాణలో సెటిల్ అవ్వాలని, ఏపీలో ఓట్లు రద్దు చేసుకొని తెలంగాణలో ఓట్లు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అనడం పెద్ద దుమారమే లేపింది. తెలంగాణలో ఏమున్నదని రావాలి అక్కడికి. తెలంగాణలో ఏముంది అసలు అంటూ ఏపీ మంత్రులు.. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 April 2023,2:00 pm

KCR – Perni Nani : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దానికి కారణాలు రెండు. ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ అంశం కాగా, మరొకటి ఏపీకి చెందిన కార్మికులను తెలంగాణలో సెటిల్ అవ్వాలని, ఏపీలో ఓట్లు రద్దు చేసుకొని తెలంగాణలో ఓట్లు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అనడం పెద్ద దుమారమే లేపింది. తెలంగాణలో ఏమున్నదని రావాలి అక్కడికి. తెలంగాణలో ఏముంది అసలు అంటూ ఏపీ మంత్రులు.. తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. వాళ్లకు కౌంటర్ గా మంత్రి హరీశ్ రావు కూడా తెలంగాణ ఇది ఉంది..

perni nani satirical comments on telangana cm kcr and harish rao

perni nani satirical comments on telangana cm kcr and harish rao

అది ఉంది అంటూ చెప్పకొచ్చారు. దీంతో మంత్రి హరీశ్ రావుపై మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్ రావు సిద్ధంగా ఉన్నారంటూ కామెంట్లు చేశారు. కేసీఆర్ ను నేరుగా తిట్టే సత్తా లేక.. తమపై విమర్శలు చేస్తున్నారంటూ హరీశ్ రావుపై పేర్ని నాని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పై కడుపుమంటతో హరీశ్ రావు ఉన్నాడు. తనకు ఎప్పుడైనా కడుపు మంట రగిలితే.. మమ్మల్ని తిడతాడు. నిజానికి.. హరీశ్ రావును కేసీఆర్ పట్టించుకోవడం లేదు.

Let's Get Reunited: Perni Nani Satires On KCR

KCR – Perni Nani : కేసీఆర్ పై కడుపుమంట రగిలితే మమ్మల్ని తిడతాడు

అదే హరీశ్ రావు బాధ, కోపం. మామాఅల్లుళ్ల మధ్య చాలా తగాదాలు ఉన్నాయి. ఏపీపై మీకు ప్రేమ ఉందా? అటువంటప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ఎందుకు అడ్డుకున్నారు. నోటితో ప్రేమ చూపిస్తారు.. నొసలతో వెక్కిరిస్తారు. ఇదే కేసీఆర్ నైజం. కేసీఆర్ ను తిట్టకపోతే మళ్లీ హరీశ్ రావు ఫీల్ అవుతారు. హైదరాబాద్ ఏ ఒక్కరు డెవలప్ చేసింది కాదు. అందరు కలిసి డెవలప్ చేస్తే అలా అయింది. దాన్ని చూసి ఇప్పుడు మీరు మురిసిపోతున్నారు. సిద్దిపేట, హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మిగితా జిల్లాల పరిస్థితి ఏంటి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది