PM Kisan : PM కిసాన్ రూ. 2 వేలు పొందాలంటే ఇలా చేయాల్సిందే..
ప్రధానాంశాలు:
PM Kisan : PM కిసాన్ రూ. 2 వేలు పొందాలంటే ఇలా చేయాల్సిందే..
PM Kisan : ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) పథకం భారత ప్రభుత్వ flagship పథకాలలో ఒకటి. రైతుల ఆర్థిక భద్రత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019లో ప్రారంభించిన ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.6,000 మూడువాయిదాలుగా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది. ప్రతి నాలుగు నెలలకూ ఒక్కో వాయిదా రూపంలో రూ. 2,000 చొప్పున ఈ సహాయం అందుతుంది. ఇప్పటి వరకు 19 వాయిదాలు విడుదల కాగా, ఫిబ్రవరి 2025లో చివరి విడత జారీ చేశారు.

PM Kisan : PM కిసాన్ రూ. 2 వేలు పొందాలంటే ఇలా చేయాల్సిందే..
PM Kisan : PM కిసాన్ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే ముందుగా ఇలా చేయాల్సిందే
ఇప్పుడు రైతులు ఆశగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 20వ వాయిదా జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే, రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను పాటించాలి. ఆధార్, బ్యాంక్ ఖాతా, NPCI లింక్ చేయడం, eKYC పూర్తి చేయడం, భూమి ధృవీకరణ జరిపించుకోవడం చాలా ముఖ్యం. ఒకే కుటుంబంలో భర్త లేదా భార్యలో ఒకరే ఈ పథకానికి అర్హులు. ఎక్కువ మంది దరఖాస్తు చేస్తే తిరస్కరించబడుతారు.
పీఎం కిసాన్ జాబితాలో లబ్ధిదారుల పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in లోకి వెళ్లి “Beneficiary Status” సెక్షన్‌కి వెళ్లాలి. అక్కడ అకౌంట్ నంబర్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా చెక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 9.7 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. ఏవైనా సమస్యల కోసం రైతులు టోల్ ఫ్రీ నంబర్ 155261 లేదా 1800115526కు కాల్ చేయవచ్చు.