PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి బహిరంగ సభలో ప్రధాన నరేంద్ర మోదీ కిసాన్ 20వ విడత రూ.2వేలు విడుదల చేశారు. మొత్తం రూ. 20వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు డబ్బులు జమ అవుతాయి. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది రూ.6వేలు అందిస్తోంది.

PM Kisan పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌ రూ2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి

PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుద‌ల‌.. రూ.2 వేలు ప‌డ్డాయా లేదా చెక్ చేసుకోండి..!

PM Kisan : ఇలా చేయండి..

2వేలు చొప్పున 3 వాయిదాలలో రైతులకు అందుతుంది. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాలో పీఎం కిసాన్ రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలి? వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి? ఏం చేస్తే వాయిదా డబ్బులు తిరిగి పొందవచ్చు? ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటే.. పీఎం కిసాన్ పథం ప్రయోజనాలు పొందాలంటే ఈ అర్హతలు రైతులకు తప్పనిసరి. చిన్న సన్నకారు రైతులు మాత్రమే పొందగలరు. రైతులు అర్హత కలిగినా రూ. 2వేలు అందకపోవచ్చు. మీ అకౌంట్లలో కూడా రూ. 2వేలు పడకపోతే ఈమెయిల్, ఫోన్ ద్వారా మీ ఫిర్యాదులను చేయొచ్చు.

రూ. 2వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి అంటే.. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ (pmkisan.gov.in)కు వెళ్లండి. ‘Know Your Status’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్ చేయండి. ‘Get Data’ ఆప్షన్ ఎంచుకోండి. 20వ విడత స్టేటస్ స్ర్కీన్‌పై వస్తుంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరును చెక్ చేయాలంటే? (pmkisan.gov.in) వెబ్‌సైట్‌కు వెళ్లండి. ‘Beneficiary List’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోండి. ‘Get Report’పై క్లిక్ చేయండి. లబ్ధిదారుల జాబితా చూడొచ్చు. ఏదైనా సమస్య ఉంటే.. హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 011-24300606కు కాల్ చేయండి. ఈ రైతులకు రూ. 2వేలు పడవు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది