PM Modi AC Yojana : ప్రధానమంత్రి మోదీ AC యోజన అంటే ఏమిటి..? దీనివల్ల ప్రయోజనాలు ఏంటి..?
PM MOdi AC Yojana : వేసవిలో విద్యుత్ వినియోగం భారీగా పెరగడం వల్ల విద్యుత్ గ్రిడ్‌పై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం “ప్రధానమంత్రి మోదీ ఏసీ యోజన” అనే కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద పౌరులు తమ పాత, ఎక్కువ విద్యుత్ వినియోగించే ఏసీలను తీసేయించి, 5 స్టార్ రేటింగ్ కలిగిన కొత్త ఏసీలను కొనుగోలు చేయవచ్చు. ఇది కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) రూపొందించిన విధానంలో భాగం.

PM Modi AC Yojana : ప్రధానమంత్రి మోదీ AC యోజన అంటే ఏమిటి..? దీనివల్ల ప్రయోజనాలు ఏంటి..?
PM MOdi AC Yojana : మోదీ ఏసీ యోజన వల్ల డబ్బు ఆదా..ఎలా అంటే..?
ఈ పథకం ప్రయోజనాల పరంగా చూస్తే.. ప్రజలు తమ పాత ఏసీలను గుర్తింపు పొందిన రీసైక్లింగ్ కేంద్రాలకు అప్పగించి, కొత్త ఏసీలపై డిస్కౌంట్ పొందవచ్చు. బ్లూ స్టార్, వోల్టాస్, LG వంటి కంపెనీలు పాత ఏసీ ఇచ్చి కొత్తదాన్ని కొన్న వారికి ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నాయి. అంతేకాదు కొత్త 5 స్టార్ ఏసీ వాడితే నెల నెలా విద్యుత్ బిల్లుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తుంది. BEE ప్రకారం.. పాత ఏసీకి బదులుగా 5 స్టార్ ఏసీ వాడితే ఏడాదికి సుమారుగా రూ.6,300 వరకు బిల్లు ఆదా అవుతుంది.
ఇప్పటికే ఢిల్లీలో BSES సంస్థ ఈ తరహా ఏసీ రీప్లేస్‌మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఇందులో 3 స్టార్ ఏసీ ఇచ్చి 5 స్టార్ ఏసీ తీసుకుంటే 60% వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇలానే ప్రధాని మోదీ ఏసీ యోజన దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రజలపై విద్యుత్ బిళ్ల భారం తగ్గించడమే కాకుండా, దేశ విద్యుత్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతుంది. ఈ పథకం “ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్” వంటి దీర్ఘకాలిక ప్రణాళికలకు అనుసంధానంగా రూపొందించబడింది.