Ponnam Prabhakar : కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్.. ఇచ్చేదాకా ఆగట్లేదా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ponnam Prabhakar : కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్.. ఇచ్చేదాకా ఆగట్లేదా…!

 Authored By aruna | The Telugu News | Updated on :17 February 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Ponnam Prabhakar : కేటీఆర్ పై పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్.. ఇచ్చేదాకా ఆగట్లేదా...!

Ponnam Prabhakar : తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సమావేశాల్లో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బిఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పొన్నం ప్రభాకర్ మరియు కేటీఆర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ సమావేశాల్లో ముందుగా కేటీఆర్ … జస్టిస్ రాజేంద్ర కుమార్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు. అయితే జస్టిస్ రాజేంద్రకుమార్ సత్యార్ కమిటీ ఏర్పాటులో కూడా మా పాత్ర ఉంది మా నాయకుడు కేసీఆర్ పాత్ర ఉంది అని తెలియజేశారు. ఆరోజు యూపీఏ లో కేంద్ర క్యాబినెట్ లో ఉన్న రోజు ఈ విషయంపై ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది.ఇక ఇప్పుడు ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే. ముఖ్యంగా బలహీన వర్గాలకు లాభం జరగాలి అనే ఆకాంక్ష పార్టీలకు అతీతంగా అందరిలో కనిపిస్తుందని తెలియజేశారు.

ఇలాంటి తరుణంలో అది శాంక్షన్ కావాలంటే రేపు ఎల్లుండి శాసనసభను పొడిగించండి అని ఈ సందర్భంగా కేసీఆర్ తెలియజేశారు. అదేవిధంగా వెంటనే బిల్లు తీసుకొని రండి మా పార్టీ మద్దతు కూడా సంపూర్ణంగా మీకు ఇస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే కేటీఆర్ తన ప్రసంగం ముగించి కూర్చున్న అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడటం మొదలుపెట్టారు.ఈ సందర్భాగా ఆయన మాట్లాడుతూ…ముందుగా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.ఇక దీనిలో కొన్ని అంశాలకు సంబంధించి వారు ప్రశ్నించినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరి సహకారం అడుగుతాను. అయితే నేను ఒకటి స్పష్టంగా చెబుతున్నాను. ఈ విధివిధానాలకు సంబంధించి గౌరవ శాసన సభ్యులకు కావచ్చు ,బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలి అని ఆకాంక్షించే వారు కావచ్చు.

రాజకీయ పార్టీలు కావచ్చు అందరూ కూడా మద్దతుగా నిలిచి పోయేది బలహీన వర్గాలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూనే మా ప్రభుత్వం మా ఆకాంక్ష కూడా అదేనంటూ ఆయన తెలియజేశారు. 2011 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఏర్పడినటువంటి ఓబీసీ పార్లమెంట్ సభ్యుడిగా దేశంలో 20 రాష్ట్రలు తిరిగే అవకాశం నాకు లభించింది. అందుకే తప్పకుండా బలహీనవర్గాల పట్ల ఒక కమిట్మెంట్ ఉంది. కాబట్టి వారికి కచ్చితంగా మేలు కలిగేలా చేస్తామని చేసే వరకు కాస్త ఆపుకోండి అంటూ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.దీంతో ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది