House Scheme : సబ్సీడీపై గృహ రుణాలు పొందాలని అనుకుంటున్నారా.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోండి..!
ప్రధానాంశాలు:
House Scheme : సబ్సీడీపై గృహ రుణాలు పొందాలని అనుకుంటున్నారా.. ఈ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోండి..!
House Scheme : మధ్యతరగతి ప్రజలకు సరసమైన గృహ సౌకర్యాలను అందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం. తీసుకొచ్చింది. దీని కింద అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు కొనడానికి లేదా నిర్మించుకోవడానికి సబ్సిడీ ఇస్తారు. ఆ పథకం ఏంటని తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆ పథకం మరేదో కాదు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. 2015లో ప్రారంభమైన ఈ పథకం, 2022 నాటికి 20 మిలియన్ గృహాలు నిర్మాణం చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు సబ్సిడీపై గృహ రుణాలు, మౌలిక వసతుల కల్పన, మరియు పర్యావరణానికి అనుకూలమైన గృహ నిర్మాణం చేయడం జరుగుతోంది.
House Scheme ఈ పథకం అద్భుతం..
పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, మధ్యతరగతి కుటుంబాలు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ రెండవ దశ కూడా ప్రారంభమైంది. దీని కింద వచ్చే ఐదేళ్లలో కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ప్రభుత్వం రూ.2.30 లక్షల కోట్లు కేటాయించింది.. ఈ స్కీమ్ ద్వారా గృహ రుణాలపై 6.5% వరకు వడ్డీ రాయితీ అందిస్తోంది. ప్రత్యేకంగా, ఈ పథకం ద్వారా నిర్మించబడే గృహాలు పర్యావరణానికి అనుకూలమైన టెక్నాలజీ ఉపయోగించి నిర్మించబడతాయి. మహిళలు లేదా భర్త-భార్యల పేరుతో గృహాలు నమోదు చేయడం కూడా ఈ పథకం ప్రత్యేకత.
మధ్య తరగతి కుటుంబాలు ఆదాయం ₹6 లక్షల నుండి ₹18 లక్షల వరకు ఉండాలి.
కుటుంబంలో ఎవరైనా సభ్యుడి పేరుతో ఇంతకు ముందు గృహం లేదా రుణ సబ్సిడీ ఉండకూడదు. లబ్ధిదారుడు రుణ వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే, డిఫాల్ట్ అయితే, ప్రభుత్వం సబ్సిడీని ఉపసంహరించుకోవచ్చు. లోన్ డిఫాల్ట్ మీ క్రెడిట్ స్కోర్‌ను మరింత దిగజార్చడమే కాకుండా, మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన సబ్సిడీని కూడా కోల్పోవచ్చు. మీరు మీ రుణ వాయిదాలను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం.ఒక లబ్ధిదారుడు పథకం కింద సబ్సిడీ పొందిన తర్వాత ఇంటిని కొనుగోలు చేసినా, ఆ ఇంట్లో తాను నివసించకపోయినా లేదా అద్దెకు ఇచ్చినట్లయితే ప్రభుత్వం పథకం దుర్వినియోగం అవుతున్నట్లు భావించవచ్చు. అటువంటి సందర్భాలలో సబ్సిడీని ఉపసంహరించుకోవచ్చు. లబ్ధిదారుడు స్వయంగా ఇంట్లోనే నివసిస్తూ వ్యక్తిగతంగా వినియోగించుకోవడం తప్పనిసరి