KCR – Prashanth Kishore : పరిస్థితి చేయిదాటిపోయింది.. ఇప్పుడు నేను ఏం చేయలేను.. కేసీఆర్‌కు తెచ్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR – Prashanth Kishore : పరిస్థితి చేయిదాటిపోయింది.. ఇప్పుడు నేను ఏం చేయలేను.. కేసీఆర్‌కు తెచ్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్

KCR – Prashanth Kishore : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వవారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో మూడోసారి గెలవడం కోసం బీఆర్ఎస్ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోందనే చెప్పుకోవాలి. హ్యాట్రిక్ గెలుపు కోసం అటు కేసీఆర్, ఇటు కేటీఆర్.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గాలి వీస్తోంది. ఆ విషయం హైకమాండ్ కు కూడా తెలిసే ఏకంగా సీఎం […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  ప్రశాంత్ కిషోర్ తో కేసీఆర్ భేటీ

  •  వారం రోజులు వ్యూహాలు రచించాలని వినతి

  •  తన వల్ల కాదని చేతులెత్తేసిన ప్రశాంత్ కిషోర్

KCR – Prashanth Kishore : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వవారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో మూడోసారి గెలవడం కోసం బీఆర్ఎస్ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోందనే చెప్పుకోవాలి. హ్యాట్రిక్ గెలుపు కోసం అటు కేసీఆర్, ఇటు కేటీఆర్.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గాలి వీస్తోంది. ఆ విషయం హైకమాండ్ కు కూడా తెలిసే ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రతి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తూ కాంగ్రెస్ ను ఎండగడుతున్నారు. అయినా కూడా ప్రజల నుంచి సరైన స్పందన రావడం లేదు. మేనిఫెస్టో కూడా అంతగా ప్రజలను ఆకట్టుకోవడం లేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల సుమారు మూడు గంటల పాటు ప్రశాంత్ కిషోర్ తో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారట. ఎన్నికల వరకు తమతో కలిసి పనిచేయాలని పీకేకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. అయితే.. బీఆర్ఎస్ ను ప్రస్తుతం జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడేం చేసినా వర్కవుట్ కాదు.. పరిస్థితి చేయిదాటిపోయింది.. అని తన నిస్సహాయతను పీకే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

కేసీఆర్ కుటుంబంపై, ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మంత్రి కేటీఆర్ పై కూడా వ్యతిరేకత ఉండటంతో.. తాను ఇప్పుడు ఏం చేయలేనని పీకే చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ప్రస్తుత తెలంగాణ పరిస్థితిపై ఫ్లాష్ సర్వే నిర్వహించి ఆ వివరాలను సీఎం కేసీఆర్ కు పీకే అందించారట. ఆ రిపోర్ట్ చూసి కేసీఆర్, కేటీఆర్ షాక్ అయినట్టు తెలుస్తోంది. పీకే తన వల్ల కాదని చెప్పినా.. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునేలా 60 సీట్లు గెలుచుకునేలా ఈ వారం రోజులు ఏదైనా ప్రణాళిక అందించాలని.. తమ వ్యూహాలను చెప్పాలని పీకేను కేసీఆర్ కోరారట. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఎలా పుంజుకుందో.. అది తెలంగాణ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో పీకే కేసీఆర్ కు చెప్పారట. ఈ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ఎలాంటి వ్యూహాలు రచించినా అది మైనస్ అవుతుంది తప్ప పార్టీకి ఏమాత్రం ప్లస్ కాదని వివరించారట.

KCR – Prashanth Kishore : ఇదివరకు కుదిరిన డీల్ కూడా క్యాన్సిల్

నిజానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసింది. కానీ.. మధ్యలో ఆ డీల్ ఎందుకో ఆగిపోయింది. ఐఫ్యాక్ సేవలను కొన్ని సర్వేల కోసం మాత్రమే వాడుకొని ఆ తర్వాత వదిలేశారు. ఇప్పుడు చివర్లో తేడా కొట్టేసరికి మళ్లీ పీకే దగ్గరికి వెళ్లడంతో ఇప్పుడు తన వల్ల కాదని పీకే కూడా చేతులెత్తేశారట. వారం రోజుల్లో ఏం చేయలేమని.. ఇప్పుడు హడావుడి చేస్తే అది మొదటికే మోసం వస్తుందని పీకే కూడా కేసీఆర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. మరి.. కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చే పరిస్థితులు నిజంగానే తెలంగాణలో లేవా? ఏం జరుగుతుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది