Raja Mother : దోషాలు పోతాయని భర్తని కావాలని చంపేసిందా.. రాజా తల్లి సంచలన కామెంట్స్
ప్రధానాంశాలు:
Raja Mother : దోషాలు పోతాయని భర్తని కావాలని చంపేసిందా.. రాజా తల్లి సంచలన కామెంట్స్
Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన భర్తని భార్యనే చంపించింది అని తేలింది. అయితే ఈ క్రమంలో ఐదుగురికి 8 రోజుల పోలీసు కస్టడీ విధించింది షిల్లాంగ్ కోర్టు. మరోవైపు తమ కుమారుడు రాజా రఘువంశీ మరణంపై అతడి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడ్ని అంతా కావాలనే చంపారని ఆరోపించారు. సోనమ్ రఘువంశీ.. తమ కుమారుడ్ని నరబలి ఇచ్చిందని విమర్శలు చేసింది.

Raja Mother : దోషాలు పోతాయని భర్తని కావాలని చంపేసిందా.. రాజా తల్లి సంచలన కామెంట్స్
Raja Mother వశీకరణం..
సోనమ్ కు జాతక దోషం ఉందని.. అందుకే తమ కుమారుడు రాజా రఘువంశీని నరబలి ఇచ్చిందని పేర్కొంది. తన కుమారుడిని చేతబడి చేసి కిరాతకంగా బలి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. జాతక దోషం పోతే తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాహాను పెళ్లి చేసుకోవాలని సోనమ్ అనుకుంది. అందుకే నా కొడుకుని నరబలి ఇచ్చారు. నా కుమారుడి మృతిపై మాకు న్యాయం జరగాలి. ఈ దారుణానికి పాల్పడ్డవారిని వదిలిపెట్టొద్దు.
నా కొడుకు ఏం తప్పు చేశాడు. అతడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అని రాజా రఘువంశీ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. సోనమ్ తన కుమారుడిని వశీకరణం చేసి లొంగదీసుకుందని.. చేతబడి చేసిందని ఆరోపించింది. ఇలాంటి ఘటనలు విన్నాం కానీ ఇప్పుడే కళ్లారా చూస్తున్నామని పేర్కొంది. పెళ్లి తర్వాత దంపతులిద్దరూ అసోంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి సోనమ్.. రాజాను నెక్ లేస్ వేసుకోమని బలవంతం చేసేదని తెలిపింది. తన కుమారుడిని నరబలి ఇస్తే అన్ని దోషాలు పోతాయని సోనమ్ భావించిందని రాజా రఘువంశీ తల్లి పేర్కొంది.