Ys jagan : ఎన్నికలలో చిత్తుగా ఓడిన జగన్.. ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!
ప్రధానాంశాలు:
Ys jagan : ఈ సారి ఎన్నికలలో చిత్తుగా ఓడిన జగన్.. ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!
Ys jagan : అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడుతున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీలో జోష్ నింపుతుంది. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి ఇప్పటికే మూడొంతులకు పైగా సీట్లను సాధించింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే ఆయన గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. 2019 నాటి ఎన్నికల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవి చూసింది వైఎస్ఆర్సీపీ. ఇంతటి భారీ విజయాన్ని అందిస్తుందని కూటమి నాయకులే ఊహించలేకపోయారు. అయితే ఇంతటి దారుణ పరాభవం ఎదుర్కొంటారని ఏ సర్వేలోనూ తేలలేదు. ఇంత చావు దెబ్బ తినడానికి పలు కారణాలు ఉన్నాయి.
Ys jagan ఓటమికి ప్రధాన కారణాలు..
జగన్ ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుండి సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. నవరత్నాలకు తోడు.. మరికొన్ని పథకాలను అమలు చేశారు . ప్రతిసారి పలు సభలలోకి వెళ్లి బటన్ నొక్కారు. అయితే ఓటర్లు మాత్రం సంక్షేమం కన్నా కూడా అభివృద్ది గురించే ఆలోచించి కూటమి బటన్స్ నొక్కారు. పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సర్పంచ్‌లు ప్రభుత్వం తీరుపై రోడ్డెక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. 2019 ఎన్నికలకి ముందు అమరావతి రాజధాని. తాను ఇక్కడే కల్లు కట్టుకున్నా అని చెప్పి ఉన్నట్టుండి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును రాజధానిగా ప్రకటించారు. అమరాతి రైతులు పిటీషన్ వేయడంతో అది ఆగిపోయింది.
మూడు రాజధానులు ప్రకటించిన జిల్లాల్లో కూడా వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. వైఎస్సార్‌సీపీ ఓటమికి మూడు రాజధానుల ప్రకటన ప్రధాన కారణంగా చెప్పొచ్చు. చావు దెబ్బ తగలడం వెనుక ప్రధాన కారణం మాజీ సీఎం జగన్ వైఖరి అని తెలుస్తోంది. జగన్ మొండి వైఖరి ఆ పార్టీని కొంప ముంచిందని తెలుస్తోంది. ఇదే కాకుండా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉంది. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని తాడేపల్లి ప్యాలెస్ అని ఆయనకు అదో రాజకోట అన్నట్లుగా మార్చుకుని..అందులో నుంచి బయటకు రాకుండా పాలన కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయటమే కాదు..చాలా సార్లు నిజం అనిపించేలా జగన్ వ్యవహరించారు.ఓ నలుగురు వ్యక్తులనో లేదా నాలుగు ఛానళ్లలోనో విమర్శించటం కాదు..మొత్తం మీడియానే దూరం పెట్టారు వైఎస్ జగన్. ఈ ఐదేళ్లలో ఆయన ప్రెస్ మీట్స్ ఇచ్చిన సందర్భాలు కేవలం రెండో మూడో మాత్రమే. ఇక ఎక్కడా రోడ్లు కనీసం మరమ్మత్తులు చేసిన సందర్భాలు లేవు. ప్రతిపక్షా పార్టీలు పలు సందర్భాల్లో రోడ్లపై ఉండే గుంతల్ని పూడ్చి నిరసనకు దిగాయి.

Ys jagan : ఈ సారి ఎన్నికలలో చిత్తుగా ఓడిన జగన్.. ఓటమికి ప్రధాన కారణాలు ఇవే..!
టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమల్ని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తరిమేసిందనే ఆరోపణలు వచ్చాయి. మద్యాన్ని దశలవారీగా పూర్తిగా నిషేధిస్తామన్న జగన్ దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్‌లు తీసుకొచ్చి ధరలు పెంచేశారు. డిజిటల్ చెల్లింపులు లేకుండా చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఎన్నికలకు కొన్ని నెలల ముందు చంద్రబాబుపై వరుసగా కేసులు తెరపైకి తేవడం.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడం.. రాజమహేంద్రవరం జైల్లో 50 రోజులకుపైగానే ఉంచడం కూడా జగన్‌కి కాస్త మైనస్ అయింది.