టీడీపీ కోసమే రేవంత్ నియామకం జరిగిందా..?
తెలంగాణ పీసీసీ చీఫ్ గా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే, కాంగ్రెస్ లో చేరిన అతి తక్కువ కాలంలోనే ఉన్నతమైన పదవికి చేరుకోవటం అనేది సామాన్యమైన విషయం కాదు. పైగా తెలంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి రాజకీయాలు ఉంటాయో అందరికి తెలిసిన విషయమే, అయినా కానీ రేవంత్ రెడ్డి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని హౌరా అనిపించాడు.
రేవంత్ నియామకం ఆషామాషిగా జరగలేదని తెలుస్తుంది. కాంగ్రెస్ సంప్రదాయాలకు విరుద్ధంగా గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తల అభిప్రాయం తీసుకోని, అనేక తీసివేతలు, కుడికలు వేసుకొని మరి ఢిల్లీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డికి పదవి కట్టబెట్టింది అనే మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణ లో టీడీపీ పార్టీ కనుమరుగైన కానీ ఆ పార్టీ సానుభూతి పరులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
మల్కాజ్ గిరి ఎఫెక్ట్
2018 అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓడిపోయినా కానీ, 2019 పార్లమెంట్ ఎన్నికలో దేశంలోనే అతిపెద్దదైన మల్కాజ్ గిరి నుండి పోటీచేసి విజయం సాధించాడు. ఆ విజయంలో టీడీపీ సానుభూతి పరులు హస్తం ఉండనే చెప్పాలి. టీడీపీ క్యాడర్ కు రేవంత్ రెడ్డి అంటే వల్లమాలిన అభిమానం. టీడీపీ నుండి వెళ్ళిపోయినా కానీ చంద్రబాబును ఒక్క మాట అనకుండా స్వామి భక్తి చూపిస్తూనే ఉన్నాడు. దీనితో రేవంత్ రెడ్డి అంటే పసుపుదళం అభిమానంగానే ఉంది.
దానిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధినాయకత్వం కూడా రేవంత్ రెడ్డి కి పీసీసీ పగ్గాలు ఇచ్చింది. అయితే టీడీపీ క్యాడర్ దగ్గర అయితే కాంగ్రెస్ క్యాడర్ కొద్దో గొప్పో జారిపోయే అవకాశం ఉంది. దానిని కూడా పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకుంది. పైగా వైఎస్ సానుభూతి పరులు కూడా కొందరు షర్మిల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చిన ఇవ్వకపోయినా వెళ్ళేవాళ్ళు ఎలాగూ వెళ్తారు. అదే రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే టీడీపీ క్యాడర్ కలిసే అవకాశం మెండుగా ఉంది. పైగా రేవంత్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు కావటంతో ఆ వర్గం మద్దతు కూడా గట్టిగానే లభిస్తుంది. ఇవన్నీ ఆలోచించే ఫైనల్ గా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. ఆయన నియామకంపై పెద్దగా వ్యతిరేకత రాలేదనే చెప్పాలి. ఒకరు ఇద్దరు నేతలు తప్పితే మిగిలిన నేతలందరూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు.