Bandaru Satyanarayana : మంత్రి రోజాను మళ్లీ కెలికిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ..!
ప్రధానాంశాలు:
Bandaru Satyanarayana : మంత్రి రోజాను మళ్లీ కెలికిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ..!
మంత్రి రోజాపై మళ్లీ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ..
Bandaru Satyanarayana : టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై కూడా చేసిన వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆయనపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయినా కూడా ఆయన మళ్లీ రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. బండారు మాట్లాడుతూ .. ప్రజలు ఛీ కొట్టిన వై.యస్.జగన్మోహన్ రెడ్డి కి సిగ్గు లేదు అని ,రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశాడని, పిల్లలకు, గర్భిణీలకు సరైన పౌష్టిక ఆహారం అందకుండా ప్రజల పొట్ట కొడుతున్నాడని, జగన్ వలన అంగన్వాడి టీచర్స్, ఆశ వర్కర్లు రోడ్డుమీదికి వచ్చారు. పారిశుద్ధ్య కార్మికులకు జీతం పెంచుతా అని పెంచకుండా వారి జీవితాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు.
ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఇంతవరకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని బండారు ప్రశ్నించారు. టీడీపీ, జనసేన పై అక్రమ కేసులు పెట్టి స్వేచ్ఛ లేకుండా చేసాడని, 500 పెన్షన్లు తీసేసి నిరుపేద కుటుంబాలతో ఆడుకున్నాడని, చివరికి కల్తీ మందు కూడా తయారు చేయించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడని జగన్ పై తీవ్రస్థాయిలో బండారు విమర్శలు చేశారు. ఫ్యాక్టరీలని తొలగించి పేదల పొట్ట కొట్టాడని, ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని, స్టీల్ ప్లాంట్ కార్మికుల జీవితాలతో ఆడుకున్నడని, పేదవారి ఇళ్లను అసంపూర్తిగా ఉంచి రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నాడని బండారు వై.యస్.జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేశారు.
సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ మోహన్ రెడ్డిని ఛీ కొడుతున్నారని, సుప్రీంకోర్టులో కూడా అతడి వాదనలను ఎవరు వినడం లేదని అన్నారు. రేపు టీడీపీ, జనసేన అధికారంలోకి రాగానే జగన్ అవినీతి కేసులన్ని బయటికి వస్తాయని భూములు దోచుకోవడం, ప్రాజెక్టులు అమ్ముకోవడం, స్థలాలను కబ్జా చేసుకోవడం ఇలా అవినీతి కేసులపై ఖచ్చితంగా కేసు పెడతామని అన్నారు. ప్రతి ఒక్క ఆధారంతో వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి పై కేసు పెట్టి రాజమండ్రి జైలుకి పంపిస్తామని బండారు సత్యనారాయణ వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. ఇక టిడిపి జనసేన ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి రావాలని కూటమిగా ఏర్పడి జగన్ పై వార్ ని ప్రకటించాయి. ఇక మరో మూడు నెలల్లో ఏపీలో శాసనసభ ఎన్నికలు రానున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోయినా ప్రజలను సంక్షేమాలతో ఆకట్టుకున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా లేక కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన గెలుస్తుందా అనేది చూడాలి.