Seethakka : తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సీతక్క.. రేవంత్ రెడ్డి అలా చెప్పడం వెనుక ఉన్న అసలు కారణం అదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Seethakka : తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి సీతక్క.. రేవంత్ రెడ్డి అలా చెప్పడం వెనుక ఉన్న అసలు కారణం అదా?

 Authored By kranthi | The Telugu News | Updated on :12 July 2023,5:00 pm

Seethakka : తెలంగాణలో ఇంకో రెండు మూడు నెలల్లో ఎన్నికల హడావుడి మొదలు కానుంది. తెలంగాణలో ప్రస్తుతం పోటీలో ఉన్న పార్టీలు అంటే మూడే అని చెప్పుకోవాలి. ఒకటి అధికార బీఆర్ఎస్. రెండోది కాంగ్రెస్. మూడోది బీజేపీ. ఇక ఈ మూడు కాక చిన్నాచితకా పార్టీలు చాలానే ఉన్నాయి కానీ.. వాటిని పట్టించుకునే నాథుడే లేడు. సరే.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నదే ఇద్దరు అయితే కేసీఆర్.. లేకపోతే కేటీఆర్. కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 99 శాతం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.

ఇక.. బీజేపీ గురించి మాట్లాడితే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అంటే.. అయితే బండి సంజయ్ లేదంటే కిషన్ రెడ్డి.. లేదా ఇంకో వ్యక్తి. ఓకే.. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడే తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ను గెలిపిస్తే ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారు అని. కానీ.. ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనే అంశం ఇక్కడి పరిధిలోనిది కాదు. అది హైకమాండ్ పరిధిలో ఉంటుంది.

seethakka is the cm candidate in telangana congress

seethakka is the cm candidate in telangana congress

Seethakka : రేవంత్ రెడ్డి ఎందుకు సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు

తాజాగా ఓ మీటింగ్ లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎస్సీ కమ్యూనిటీ 18 శాతం ఉంది. ఎస్సీ కమ్యూనిటీ 12 శాతం ఉంది. మరి.. 18 శాతంగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ నుంచి భట్టి విక్రమార్కను సీఎం అభ్యర్థిగా చూపిస్తే.. 12 శాతంగా ఉన్న ఎస్టీ కమ్యూనిటీ నుంచి ఉన్న సీతక్కను డిప్యూటీ సీఎంను చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. దీంతో రేవంత్ రెడ్డి ఆ ప్రశ్నకు సమాధానంగా.. సీతక్కను ఉపముఖ్యమంత్రిని కాదు.. ఆ సందర్భం వస్తే ముఖ్యమంత్రే అవుతారు.. అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంతో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. సీతక్కనే సీఎంను చేస్తారా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది