Shyamala : వామ్మో.. యాంకర్ శ్యామలకి ఇంత ధైర్యం ఎక్కడింది.. ఏకంగా పవన్ కళ్యాణ్‌పైనే విమర్శలా?
Shyamala : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నారు. అధికార, ప్రతిపక్షాల విమర్శలతో ఏపీ రాజకీయ మరింత వేడెక్కుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ వాళ్ళు సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలతో ప్రచారాలు చేయించుకుంటున్నారు. జబర్దస్త్ హైపర్ ఆది, హీరోయిన్ నమిత, నిఖిల్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వాళ్ళు కూటమికి మద్దతుగా నిలబడి ప్రచారం చేస్తున్నారు. పవన్ ని పిఠాపురంలో గెలిపించడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలో వంగా గీతను ఓడించలేరని యాంకర్, సినీ నటి, వైసీపీ నాయకురాలు శ్యామల కామెంట్స్ చేశారు.
Shyamala : శ్యామల ఫైర్
పవన్ లో ఓటమి భయం ఉందని.. నిజంగా ఆయనకు అంత పవర్ ఉంటే ప్రచారానికి హైపర్ ఆది లాంటి వాళ్లు ఎందుకని ఆమె కామెంట్ చేశారు. రియాలిటీ ప్రజలకి తెలుసు. చెప్పేవాళ్లు ఎన్నైన చెబుతారు. కాని జరిగేది జరుగుతుంది. పిఠాపురంలో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు శ్యామల . వంగా గీత రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే.. ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో అందరికీ తెలుసునని.. చుట్టూ ఉన్న ప్రజల కోసం ఆమె ఎన్నో సాయాలు చేశారు. చిన్న పొజీషన్‌లో ఉన్నా కూడా ఆమె అందరికి తనవంతు సాయం చేసింది. అలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ ని కొట్టాలంటే మరి పవన్ కి ఆ మాత్రం సపోర్ట్ అవసరం అని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే.. జబర్దస్త్ టీమ్ పని చేస్తున్నారంటే రకరకాల ఒత్తిళ్లు, రకరకాల కారణాలు ఉండవచ్చునని అన్నారు.

Shyamala : వామ్మో.. యాంకర్ శ్యామలకి ఇంత ధైర్యం ఎక్కడింది.. ఏకంగా పవన్ కళ్యాణ్‌పైనే విమర్శలా?
తాను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి.. వంగా గీతను కలవడానికి కారణం.. భారీ మెజారిటీతో గెలిపించడం కోసమే అని శ్యామల చెప్పుకొచ్చారు.. కూటమి అన్నారు, మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ అందులో బీజేపీ పెద్దన్న మోదీ ఫోటో లేదని.. మాకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు చెప్పడం జరిగిందని.. అదే కూటమికి మైనస్ అని శ్యామల కామెంట్స్ చేశారు. ఇవాళ ఒక న్యూస్ పేపర్ చూసుకుంటే.. అందులో కేవలం ఒకరి ఫోటో మాత్రమే ఉందని.. మిగతా ఇద్దరి ఫోటోల్లో కూడా ఒకరి ఫోటో లేదని.. అక్కడ ఇంకో మైనస్ అని అన్నారు. ఇలా కూటమికి ఒకదాని తర్వాత ఒకటి మైనస్ లవుతూ వస్తున్నాయని.. అవే వైసీపీ పార్టీకి ప్లస్ అవుతున్నాయని అన్నారు. కూటమి దయ వల్ల ఇంత మండుటెండలో, ఉక్కబోతలో పాపం వృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని.. చూస్తుంటే కడుపు మండిపోతుందంటూ శ్యామల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.